రైలు ప్రమాదంలో కాలు కోల్పోయినా..
ABN , Publish Date - Sep 03 , 2024 | 05:24 AM
అరంగేట్ర పారాలింపిక్స్‌లోనే స్వర్ణ పతకం సొంతం చేసుకున్న నితేష్ కుమార్ రాజస్థాన్‌లో జన్మించాడు. నితేష్ తండ్రి నేవీలో అధికారి. ఆయన బాటలో నడుస్తూ నౌకా దళంలో ప్రవేశించి దేశ సేవ చేయాలని కూడా అనుకున్నాడు. కానీ 2009లో జరిగిన ప్రమాదం
(ఆంధ్రజ్యోతి క్రీడా విభాగం) : అరంగేట్ర పారాలింపిక్స్‌లోనే స్వర్ణ పతకం సొంతం చేసుకున్న నితేష్ కుమార్ రాజస్థాన్‌లో జన్మించాడు. నితేష్ తండ్రి నేవీలో అధికారి. ఆయన బాటలో నడుస్తూ నౌకా దళంలో ప్రవేశించి దేశ సేవ చేయాలని కూడా అనుకున్నాడు. కానీ 2009లో జరిగిన ప్రమాదం కుమార్ కలలను చిదిమేసింది. విశాఖట్నంలో కదులుతున్న రైలుబోగీ నుంచి జారిపడడంతో ఎడమ కాలును కోల్పోయాడు. దాంతో ఎన్నోరోజులు మంచానికే పరిమితమయ్యాడు. ఆ విషాదం నుంచి కోలుకొని చదువు కొనసాగించాడు. పుణెలో కృత్రిమ అవయవ కేంద్రాన్ని సందర్శించడం కుమార్ జీవిత దృక్పధాన్ని మార్చివేసింది. యుద్ధాలలో గాయపడిన అనేకమంది సైనికులను ఆ కేంద్రంలో చూశాక..తన అవయవలోప సవాలును అధిగమించడం కష్టమేమీ కాదని గ్రహించాడు. ఆపై ఏడాదిపాటు కష్టపడి చదివి 2013లో మండిలోని ఐఐటీలో సీటు సాధించాడు. అక్కడే బ్యాడ్మింటన్‌పట్ల ఆసక్తి పెంచుకున్న నితేశ్.. 2016లో పారా జాతీయ బ్యాడ్మింటన్ చాంపియన్‌షి్‌పలో కాంస్యం అందుకున్నాడు. 2017లో ఐరిష్ ఇంటర్నేషనల్ చాంపియన్‌షి్‌పలో టైటిల్ దక్కించుకున్నాడు. ఇక, 2019, 2020 ప్రపంచ చాంపియన్‌షిప్స్‌లో రజతాలు, 2024 ప్రపంచ టోర్నీలో కాంస్య పతకంతో అదరగొట్టాడు. ఆసియా పారా గేమ్స్‌లో ఒక స్వర్ణం, మరో రజతం, రెండు కాంస్య పతకాలు కుమార్ కొల్లగొట్టాడు. 29 ఏళ్ల నితేష్ హరియాణా ప్రభుత్వ క్రీడా యువజన శాఖలో బ్యాడ్మింటన్ సీనియర్ కోచ్‌గా భవిష్య షట్లర్లను తీర్చిదిద్దుతున్నాడు.