Share News

Asia Cup : మన ప్రత్యర్థి మళ్లీ శ్రీలంకే

ABN , Publish Date - Jul 27 , 2024 | 06:21 AM

రెండేళ్ల కిందట బంగ్లాదేశ్‌ ఆతిథ్యమిచ్చిన మహిళల ఆసియా కప్‌లో..టైటిల్‌ ఫైట్‌లో భారత్‌ ప్రత్యర్థి శ్రీలంకే. ఇక ఈసారి కూడా ట్రోఫీకోసం ఆ జట్టుతోనే హర్మన్‌ప్రీత్‌ సేన అమీతుమీ తేల్చుకోనుంది. శుక్రవారం జరిగిన సెమీఫైనల్లో బంగ్లాదేశ్‌ను డిఫెండింగ్‌ చాంపియన్‌ భారత్‌ చిత్తు చేస్తే..ఉత్కంఠ

Asia Cup : మన ప్రత్యర్థి  మళ్లీ శ్రీలంకే

సెమీస్‌లో బంగ్లాపై భారత్‌ విజయం

పాక్‌కు లంక షాక్‌

ఆసియా కప్‌ ఫైనల్లో అమీతుమీ రేపు

దంబుల్లా: రెండేళ్ల కిందట బంగ్లాదేశ్‌ ఆతిథ్యమిచ్చిన మహిళల ఆసియా కప్‌లో..టైటిల్‌ ఫైట్‌లో భారత్‌ ప్రత్యర్థి శ్రీలంకే. ఇక ఈసారి కూడా ట్రోఫీకోసం ఆ జట్టుతోనే హర్మన్‌ప్రీత్‌ సేన అమీతుమీ తేల్చుకోనుంది. శుక్రవారం జరిగిన సెమీఫైనల్లో బంగ్లాదేశ్‌ను డిఫెండింగ్‌ చాంపియన్‌ భారత్‌ చిత్తు చేస్తే..ఉత్కంఠ భరితంగా జరిగిన రెండో సెమీ్‌సలో 3 వికెట్లతో పాకిస్థాన్‌కు శ్రీలంక షాకిచ్చింది. ఆదివారం ఫైనల్‌ జరగనుంది.

రేణుక, రాధిక మెరిసే..: పవర్‌ ప్లేలో పేసర్‌ రేణుకా సింగ్‌ (3/10) నిప్పులు చెరిగే బంతులు..మిడిల్‌ ఓవర్లలో రాధా యాదవ్‌ (3/14) మెరుపులు..దాంతో బంగ్లాదేశ్‌తో సెమీఫైనల్లో అలవోకగా గెలుపొందిన భారత్‌ ఆసియా కప్‌ తుది పోరుకు చేరింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన బంగ్లాదేశ్‌ 20 ఓవర్లలో ఎనిమిది వికెట్లకు 80 పరుగులే సాధించింది. కెప్టెన్‌ నిగర్‌ సుల్తానా (32), చివర్లో షోర్నా అక్తర్‌ (19 నాటౌట్‌) కాస్త బ్యాట్లు ఝళిపించబట్టి బంగ్లాకు ఆ స్కోరైనా సాధ్యమైంది. స్వల్ప ఛేదనలో ఓపెనర్లు మంధాన (55 నాటౌట్‌), షఫాలీ వర్మ (26 నాటౌట్‌) ప్రత్యర్థి బౌలర్లను ఆడేసుకున్నారు. దాంతో ఇంకా 9 ఓవర్లు మిగిలుండగానే భారత్‌ 83/0తో మ్యాచ్‌ను ముగించేసింది. ఇక..మరో సెమీఫైనల్లో మొదట పాకిస్థాన్‌ను 20 ఓవర్లలో 140/4 స్కోరు చేసింది. అనంతరం శ్రీలంక 19.5 ఓవర్లలో 141/7 స్కోరు చేసి విజయం అందుకుంది.

సంక్షిప్తస్కోర్లు

బంగ్లాదేశ్‌: 20 ఓవర్లలో 80/8 (నిగర్‌ సుల్తానా 32, షోర్నా అక్తర్‌ నాటౌట్‌ 19, రేణుకా సింగ్‌ 3/10, రాధా యాదవ్‌ 3/14)

భారత్‌: 11 ఓవర్లలో 83/0 (మంధాన నాటౌట్‌ 55, షఫాలీ నాటౌట్‌ 26).

Updated Date - Jul 27 , 2024 | 06:21 AM