Cricket: అమ్మాయిగా మారిన స్టార్ క్రికెటర్ కుమారుడు
ABN , Publish Date - Nov 11 , 2024 | 05:21 PM
అబ్బాయిగా ఉన్న తను అమ్మాయిగా మారిన క్రమాన్ని వీడియో రూపంలో పోస్ట్ చేశాడు. 23 ఏళ్ల ఆర్యన్ తన పేరును సైతం అనయాగా మార్చుకున్నాడు. హార్మోన్ శస్త్ర చికిత్స చేసుకుంటున్న సమయంలో దాదాపు 10 నెలల పాటు తన ప్రయాణాన్ని నెటిజన్లతో పంచుకున్నాడు. అప్పటికే ఈ వీడియో హాట్ టాపిక్ గా మారడంతో ..
భారత మాజీ క్రికెటర్, కోచ్ సంజయ్ బంగర్ కుమారుడు ఆర్యన్ లింగమార్పిడి చేయించుకున్న విషయాన్ని కన్ఫర్మ్ చేశాడు. ఈ విషయాన్ని ఆర్యన్ స్వయంగా సోషల్ మీడియా ద్వారా వెల్లడించాడు. అబ్బాయిగా ఉన్న తను అమ్మాయిగా మారిన క్రమాన్ని వీడియో రూపంలో పోస్ట్ చేశాడు. 23 ఏళ్ల ఆర్యన్ తన పేరును సైతం అనయాగా మార్చుకున్నాడు. హార్మోన్ శస్త్ర చికిత్స చేసుకుంటున్న సమయంలో దాదాపు 10 నెలల పాటు తన ప్రయాణాన్ని నెటిజన్లతో పంచుకున్నాడు. అప్పటికే ఈ వీడియో హాట్ టాపిక్ గా మారడంతో తిరిగి డిలీట్ చేశాడు. ఈ వీడియోలో ధోనీ, కోహ్లీ వంటి స్టార్ క్రికెటర్లతో దిగిన ఫొటోలు కూడా షేర్ చేశాడు.
చిన్ననాటి నుంచి తన తండ్రినే స్పూర్తిగా తీసుకుని పెరిగిన తనకు ఆయనలాగే దేశం తరఫున ఆడాలని ఉందన్నాడు. అయితే, తాను జెండర్ విషయంలో తీసుకున్న నిర్ణయం కారణంగా ఆ అవకాశం ఎప్పటికీ దక్కదేమో అన్న ఆందోళన వ్యక్తం చేశాడు.
“చిన్నప్పటి నుంచే క్రికెట్ నా జీవితంలో భాగమైంది. పెరుగుతున్న క్రమంలో మా నాన్న దేశానికి ప్రాతినిధ్యం వహించడం, కోచ్‌గా ఉండటం నేను విస్మయంతో చూసేవాణ్ని. ఇప్పుడు నేను కూడా అతని అడుగుజాడల్లో నడవాలని కలలుకంటున్నాను. క్రీడల పట్ల ఆయన చూపిన ఇష్టం, క్రమశిక్షణ, అంకితభావం నాకు ఎంతో స్ఫూర్తినిచ్చాయి. క్రికెట్ నా ఆశయం మరియు నా భవిష్యత్తు. నేను నా నైపుణ్యాలను మెరుగుపరుచుకోవడానికి నా జీవితమంతా వెచ్చిస్తాను. ఏదో ఒక రోజు, అతనిలాగే నా దేశానికి ప్రాతినిధ్యం వహించే అవకాశం వస్తుందని ఆశిస్తున్నాను’’ అని తెలిపాడు.
"బాధాకరమైన విషయం ఏమిటంటే.. హార్మోన్ రీప్లేస్‌మెంట్ థెరపీ (హెచ్‌ఆర్‌టి) ద్వారా ట్రాన్స్ ఉమెన్‌గా మారడంతో నా శరీరం బాగా మారిపోయింది. ఒకప్పటి లాగా నా శరీర కండరాలు లేవు. జ్ఞాపకశక్తి , అథ్లెటిక్ సామర్ధ్యాలను కోల్పోతున్నాను. నేను ఎంతో ప్రేమించి క్రికెట్ నా నుంచి దూరమవుతోంది” అని ఆర్యన్ తన పోస్ట్‌లో రాశాడు.
ట్రాన్స్‌జెండర్లకు నో ఎంట్రీ..
అయితే, మహిళల క్రికెట్‌లో ట్రాన్స్‌జెండర్ అథ్లెట్లు పాల్గొనడానికి అనుమతించలేమని నవంబర్ 2023లో ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) పేర్కొంది.
మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Read More Latest Telugu News Click Here