Share News

Yuvraj Singh: రోహిత్, సూర్య కాదు.. ఓవర్లో ఆరు సిక్స్‌లు కొట్టగలిగేది అతనొక్కడే.. యువరాజ్ కామెంట్స్ వైరల్!

ABN , Publish Date - Apr 27 , 2024 | 04:03 PM

టీ-20 క్రికెట్‌కు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తీసుకొచ్చిన తొలి తరం ఆటగాళ్లలో డాషింగ్ బ్యాట్స్‌మెన్ యువరాజ్ సింగ్ ఒకడు. 2007లో మొట్ట మొదటిసారి జరిగిన టీ-20 ప్రపంచకప్‌లో యువరాజ్ ఒకే ఓవర్లో ఆరు సిక్స్‌లు కొట్టి ఔరా అనిపించాడు. ఆ తర్వాత ఇప్పటివరకు ఎవరూ ఆ ఫీట్‌ను రిపీట్ చేయలేకపోయారు.

Yuvraj Singh: రోహిత్, సూర్య కాదు.. ఓవర్లో ఆరు సిక్స్‌లు కొట్టగలిగేది అతనొక్కడే.. యువరాజ్ కామెంట్స్ వైరల్!
Yuvraj Singh

టీ-20 క్రికెట్‌కు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తీసుకొచ్చిన తొలి తరం ఆటగాళ్లలో డాషింగ్ బ్యాట్స్‌మెన్ యువరాజ్ సింగ్ (Yuvraj Singh) ఒకడు. 2007లో మొట్ట మొదటిసారి జరిగిన టీ-20 ప్రపంచకప్‌లో (T20 World cup) యువరాజ్ ఒకే ఓవర్లో ఆరు సిక్స్‌లు కొట్టి ఔరా అనిపించాడు. ఆ తర్వాత ఇప్పటివరకు ఎవరూ ఆ ఫీట్‌ను రిపీట్ చేయలేకపోయారు. 2007 ప్రపంచకప్‌ను భారత్ చేజిక్కించుకోవడంలో యువరాజ్‌ది కీలక పాత్ర. ఇక, జూన్ ఒకటి నుంచి వెస్టిండీస్-అమెరికా వేదికగా టీ-20 ప్రపంచకప్ జరగబోతోంది.


ఆ ప్రపంచకప్‌నకు బ్రాండ్ అంబాసిడర్‌గా యువరాజ్ సింగ్‌ను ఐసీసీ ఎంపిక చేసింది. కాగా, టీ-20 ప్రపంచకప్‌లో పాల్గొనే టీమిండియా జట్టు గురించి చాలా మంది మాజీలు ఇప్పటికే తమ అభిప్రాయాలను వెల్లడించారు. తాజాగా యువీ కూడా తన మనసులో మాట బయటపెట్టాడు. తాజాగా ఓ ఈవెంట్‌లో పాల్గొన్న యువీకి.. ``ఈ ప్రపంచకప్‌లో ఒకే ఓవర్లో ఆరు సిక్స్‌లు కొట్టగల సత్తా ఎవరికి ఉంది`` అనే ప్రశ్న ఎదురైంది. దానికి యువీ స్పందిస్తూ.. ``ఆ సత్తా హార్దిక్ పాండ్యాకే (Hardik Pandya) ఉందని అనుకుంటున్నా`` అన్నాడు.


ఈ ప్రపంచకప్ జట్టులో హార్దిక్‌కు స్థానం దక్కుతుందా? లేదా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో యువీ వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. ప్రస్తుత సీజన్‌లో దూకుడు బ్యాటింగ్‌తో అదరగొడుతున్న దినేష్ కార్తీక్‌ను (Dinesh Karthik) ఎంపిక చేయడం గురించి యువీ స్పందించాడు. ``కార్తీక్‌ను ఎంపిక చేసే ముందు ఆలోచించాలి. తుది జట్టులో స్థానం ఉందంటేనే అతడిని తీసుకోవాలి. డగౌట్‌కే పరిమితం చేసేలా ఉంటే కార్తీక్‌ను తీసుకోకూడదు. అతడి బదులు కొత్త ఆటగాడిని తీసుకుంటే అతడికి అనుభవం వస్తుంద``ని యువీ వ్యాఖ్యానించాడు.

ఇవి కూడా చదవండి..

Gautam Gambhir: ఓవర్ త్రో పరుగు విషయంలో అసంతృప్తి.. మ్యాచ్ అంపైర్లతో గంభీర్ గొడవ!


Viral News: MS ధోని పేరుతో కొత్త స్కాం..జర జాగ్రత్త


మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Apr 27 , 2024 | 04:03 PM