Google Pixel 8a: గూగుల్ పిక్సెల్ 8a ధర, ఫీచర్లు ఇవే.. కొనాలనుకుంటే.. ఓ లుక్కేయండి..!
ABN , Publish Date - May 08 , 2024 | 04:15 PM
గూగుల్ నుంచి మరో ఫ్లాగ్‌షిప్ ఫోన్ భారత్‌లో లాంఛ్ అయింది. టెక్ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన గూగుల్ పిక్సెల్ 8ఎ ఫోన్ మార్కెట్లోకి వచ్చింది. మే 14వ తేదీన పిక్సెల్ ఆఫ్ ది ఇయర్ (I/O) ఈవెంట్‌లో ఈ కొత్త పిక్సెల్ 8ఎ ఫోన్‌ను గూగుల్ ఆవిష్కరించనుందని అందరూ అనుకున్నారు.
గూగుల్ నుంచి మరో ఫ్లాగ్‌షిప్ ఫోన్ భారత్‌లో లాంఛ్ అయింది. టెక్ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన గూగుల్ పిక్సెల్ 8ఎ ఫోన్ మార్కెట్లోకి వచ్చింది. మే 14వ తేదీన పిక్సెల్ ఆఫ్ ది ఇయర్ (I/O) ఈవెంట్‌లో ఈ కొత్త పిక్సెల్ 8ఎ ఫోన్‌ను గూగుల్ ఆవిష్కరించనుందని అందరూ అనుకున్నారు. అయితే అంతకంటే ముందే మంగళవారం సాయంత్రం ఈ ఫోన్‌ను ఇండియాలో లాంఛ్ చేశారు.. ఈ నేపథ్యంలో ఈ ఫోన్ స్పెషిఫికేషన్స్, రేటు, వేరియంట్ల గురించిన విశేషాలు మీకోసం..
పిక్సెల్ 8a ఫీచర్లు:
1) గూగుల్ పిక్సెల్ 8aలో ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 4,404 mah బ్యాటరీ అమర్చారు.
2)పిక్సెల్ 8లో ఉపయోగించిన గూగుల్ టెన్సార్ జీ3 చిప్ ఇచ్చారు
3)6.1 ఇంచ్ ఓ-ఎల్‌ఈడీ డిస్‌ప్లేతో, 120HZ రీఫ్రెష్ రేట్‌తో, 2000 నిట్స్ బ్రైట్‌నెస్‌తో ఈ ఫోన్ డిస్‌ప్లే ఉండనుంది.
4)వెనుక వైపు 64 MP ప్రైమరీ కెమేరా, 13 MP ఆల్ట్రా-వైడ్ యాంగిల్ కెమేరా వెనుక వైపు ఉండనున్నాయి.
5)ఐపీ డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెన్స్, వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్ ఉండనుంది. ఆండ్రాయిడ్ 14 ఆపరేటింగ్ సిస్టమ్‌తో రన్ అవుతుంది.
6)5G, 4G LTE కనెక్టివిటీతో AI సంబంధిత ఫీచర్లతో యూజర్‌కు మరింత మెరుగైన అనుభూతిని అందించునుంది.
గూగుల్ పిక్సెల్ 8a ధర:
గూగుల్ పిక్సెల్ 8a రెండు వేరియెంట్లలో అందుబాటులోకి రానుంది. 128 జీబీ వేరియంట్‌తో వచ్చే మొబైల్ ధర రూ.52,999. ఇక, 256 జీబీ వేరియంట్ ధర రూ.59,999. ఎంపిక చేసిన బ్యాంక్ కార్డులపై రూ.4000 వరకు క్యాష్ బ్యాక్ రానుంది. అలాగే ఎక్స్ఛేంజ్ ఆఫర్ ద్వారా రూ.9000 వరకు బోనస్ పొందవచ్చు. మే 14వ తేదీ నుంచి విక్రయాలు మొదలవుతాయి.
ఇవి కూడా చదవండి..
Two Pan Cards: ఒకే వ్యక్తి 2 పాన్ కార్డులు తీసుకోవచ్చా, తీసుకుంటే ఏమవుతుంది?
Air India Express: 70కిపైగా విమానాలు రద్దు చేసిన ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్.. కారణం తెలిస్తే షాక్
మరిన్ని టెక్నాలజీ వార్తలు కోసం క్లిక్ చేయండి..