Google: Pixel 8a స్మార్ట్‌ఫోన్ లాంచ్‌కు ముందే ఫీచర్లు లీక్
ABN , Publish Date - Apr 14 , 2024 | 11:45 AM
గూగుల్ కొత్త స్మార్ట్‌ఫోన్ Google Pixel 8a వచ్చే నెలలో లాంచ్ కానుంది. అయితే దీని లాంచ్‌కు ముందే కొన్ని ఫీచర్లు లీక్ అయ్యాయి. ఈ సందర్భంగా లీకైన డిజైన్, ఫీచర్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఈ ఫోన్‌ను మే 14న జరిగే Google I/O 2024 ఈవెంట్‌లో లాంచ్ చేయనున్నారు.
గూగుల్ కొత్త స్మార్ట్‌ఫోన్ Google Pixel 8a వచ్చే నెలలో లాంచ్ కానుంది. అయితే దీని లాంచ్‌కు ముందే కొన్ని ఫీచర్లు లీక్ అయ్యాయి. ఈ సందర్భంగా లీకైన డిజైన్, ఫీచర్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఈ ఫోన్‌ను మే 14న జరిగే Google I/O 2024 ఈవెంట్‌లో లాంచ్ చేయనున్నారు. ఈ క్రమంలో Google Pixel 8aకు సంబంధించిన మోడల్ కలర్ ఎంపిక చిత్రాలు వెలుగులోకి వచ్చాయి. వాటిలో బ్లూ, గ్రీన్, నలుపు, తెలుగు రంగులు ఉన్నాయి. ఈ ఫోన్‌లో 64 మెగాపిక్సెల్ ప్రధాన కెమెరా, 13 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరాతో వస్తుంది.
ఈ ఫోన్ 5000mAh బ్యాటరీ, 27W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో లభించనుంది. డిస్ప్లే గురించి మాట్లాడితే నివేదికల ప్రకారం ఈ ఫోన్ 1080x2400 పిక్సెల్ రిజల్యూషన్‌తో 6.1 అంగుళాల పూర్తి HD+ OLED ప్యానెల్‌తో రానుంది. ఈ డిస్‌ప్లే 120Hz రిఫ్రెష్ రేట్‌కు సపోర్ట్ చేయనుంది. కంపెనీ తన Tensor G3 చిప్‌సెట్‌తో Pixel 8aని ప్రారంభించవచ్చు. ఈ చిప్‌సెట్ గతంలో పిక్సెల్ 8, పిక్సెల్ 8 ప్రోలో కనిపించింది. OS విషయానికి వస్తే ఈ ఫోన్ Android 14లో పని చేస్తుంది.
ఇది కూడా చదవండి:
Hyd to Goa: కేవలం రూ.425తోనే గోవా ట్రిప్.. ఇది మీకు తెలుసా?
Credit Card: క్రెడిట్ కార్డ్ ఉపయోగం వల్ల 10 లాభాలు.. అవి ఏంటంటే
మరిన్ని సాంకేతిక వార్తల కోసం