Share News

Google: గూగుల్‌లో సుందర్ పిచాయ్ 20 ఏళ్ల ప్రయాణం.. ఆసక్తికర పోస్ట్

ABN , Publish Date - Apr 28 , 2024 | 09:02 AM

ఆల్ఫాబెట్, గూగుల్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (CEO) సుందర్ పిచాయ్ ఏప్రిల్ 26తో కంపెనీలో 20 సంవత్సరాల ప్రయాణాన్ని పూర్తి చేసుకున్నారు. రెండు దశాబ్దాలు పూర్తి చేసుకున్న సందర్భంగా పిచాయ్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఆసక్తికర పోస్ట్ చేశారు.

Google: గూగుల్‌లో సుందర్ పిచాయ్ 20 ఏళ్ల ప్రయాణం.. ఆసక్తికర పోస్ట్

ఇంటర్నెట్ డెస్క్: ఆల్ఫాబెట్, గూగుల్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (CEO) సుందర్ పిచాయ్(Sundar Pichai) ఏప్రిల్ 26తో కంపెనీలో 20 సంవత్సరాల ప్రయాణాన్ని పూర్తి చేసుకున్నారు. రెండు దశాబ్దాలు పూర్తి చేసుకున్న సందర్భంగా పిచాయ్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఆసక్తికర పోస్ట్ చేశారు.

గత 20 ఏళ్లలో సాంకేతికత, తమ కంపెనీ ఉత్పత్తులను వినియోగించే వారి సంఖ్య పెరిగిందని.. సమాజంలో మార్పులు చోటు చేసుకున్నాయని చెప్పారు. సుందర్ 2004లో గూగుల్‌లో ప్రొడక్ట్ మేనేజర్‌గా చేరారు.


"ఏప్రిల్ 26, 2004 గూగుల్‌లో నా మొదటి రోజు. అప్పటి నుంచి ఇప్పటి వరకు సమాజంలో, సంస్థలో చాలా మార్పులు వచ్చాయి. సాంకేతికత, మా ఉత్పత్తులను ఉపయోగించేవారి సంఖ్య పెరిగింది. గూగుల్‌లో పని చేస్తూ నిరంతరం థ్రిల్ పొందుతాను. ఇందులో పని చేయడం అదృష్టంగా భావిస్తున్నాను. " అని పోస్ట్‌లో రాసుకొచ్చారు.

Googleలో 20 సంవత్సరాలు పూర్తి చేసుకున్నందున పిచ్చాయ్‌కి అభినందనలు తెలుపుతూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. పిచాయ్‌ది రెండు దశాబ్దాల అంకితభావం, 20 సంవత్సరాల విజయాలు, అద్భుతమైన రాణింపు అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. టెక్‌ ఇండస్ట్రీలో 20 ఏళ్లు గడిచినా మీకు బట్టతల రాలేదంటే చాలా గ్రేట్ అంటు మరో నెటిజన్ ఫన్నీగా స్పందించాడు.


ఆయన విజయాలివే..

Googleలో పిచాయ్ Chrome, Chrome OS వంటి అనేక ఉత్పత్తుల డిజైన్‌లో కీలకంగా ఉన్నారు. గూగుల్ డ్రైవ్ అభివృద్ధిలో కూడా ఆయన కీలక పాత్ర పోషించారు. 2015 ఆగస్టులో ఆయన Google CEOగా నియమితుడయ్యారు. 2019లో ఆల్ఫాబెట్ CEO బాధ్యతలూ చేపట్టారు.

మరిన్ని టెక్ వార్తల కోసం..

Updated Date - Apr 28 , 2024 | 09:02 AM