Phone Settings: ముఖ్యమైన కాల్స్ మాత్రమే వినపడాలంటే.. ఈ సెట్టింగ్స్ ఆన్ చేసుకోండి
ABN , Publish Date - Oct 13 , 2024 | 02:53 PM
మంచి నిద్రలో ఉన్నప్పుడు ఎక్కువగా సతాయించేది ఫోనే. నోటిఫికేషన్లు, ఫోన్ కాల్స్ రూపంలో నిద్రకు ఆటంకం అవుతుంది. స్మార్ట్‌ఫోన్‌లలో "డోంట్ డిస్టర్బ్" (DND) మోడ్‌ను యాక్టివేట్ చేస్తే, అది ముఖ్యమైన కాల్‌లు, సందేశాలను బ్లాక్ చేయవచ్చు.
ఇంటర్నెట్ డెస్క్: మనిషికి ఆహారంలాగే నిద్ర కూడా ఎంతో ముఖ్యం. పగలు ఎంత పని చేసినా.. రాత్రి సుఖవంతమైన నిద్రతో బ్రెయిన్ రిఫ్రెష్ అవుతుంది. నిద్ర పోయేటప్పుడు చుట్టుపక్కల వాతావరణం కూడా ప్రశాంతంగా ఉండేలా చూసుకోవాలి. లేదంటే తరచూ నిద్రకు భంగం కలగవచ్చు. మంచి నిద్రలో ఉన్నప్పుడు ఎక్కువగా సతాయించేది ఫోనే. నోటిఫికేషన్లు, ఫోన్ కాల్స్ రూపంలో నిద్రకు ఆటంకం అవుతుంది. స్మార్ట్‌ఫోన్‌లలో "డోంట్ డిస్టర్బ్" (DND) మోడ్‌ను యాక్టివేట్ చేస్తే, అది ముఖ్యమైన కాల్‌లు, సందేశాలను బ్లాక్ చేయవచ్చు.
ఒక నిర్దిష్ట సమయంలో ఆటోమేటిక్‌గా DNDని యాక్టివేట్ చేసి, ముఖ్యమైన కాల్స్‌ని మాత్రమే అనుమతించే సెట్టింగ్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. DND మోడ్‌లో షెడ్యూలింగ్ ఎంపిక ఉంటుంది. ఇది నిర్దిష్ట సమయాలను సెట్ చేయడానికి వినియోగదారులను అనుమతిస్తుంది. DND మోడ్‌ను దాటవేయడానికి ఇంపార్టెంట్ కాంటాక్ట్స్‌ను కూడా సెట్ చేయవచ్చు. తద్వారా ముఖ్యమైన కాల్‌లు లేదా సందేశాలు మిస్ కాకుండా ఉంటాయి.
ఆన్ చేసుకోండిలా..
1. మొబైల్ సెట్టింగ్స్‌లోకి వెళ్లండి. అనంతరం "Do not disturb" ఆప్షన్‌పై క్లిక్ చేయండి
2. ఆప్షన్స్‌లో "Do not disturb"ని ఎంచుకోండి.
3. "జనరల్" కింద "షెడ్యూల్స్"అనే ఆప్షన్‌కు నావిగేట్ క్లిక్ చేయండి.
4. "షెడ్యూల్స్"లో "స్లీపింగ్" ఆప్షన్‌పై నొక్కండి. నిద్ర షెడ్యూల్ ప్రకారం సమయాన్ని సర్దుబాటు చేయండి.
5. "Add more" ఆప్షన్‌పై క్లిక్ చేయడం ద్వారా మరిన్ని షెడ్యూళ్లను జత చేయవచ్చు.
6. "డోంట్ డిస్టర్బ్ బిహేవియర్" కింద, కాల్‌లు, సందేశాల కోసం ప్రాధాన్యతలను సెట్ చేయండి.
7. 'Alarm can override end time' టోగుల్ అనేబుల్ అయిందని గుర్తుంచుకోండి.
ఈ స్టెప్స్‌ను అనుసరించడం ద్వారా ఫోన్‌లో DND మోడ్ ఆన్ అవుతుంది. ముఖ్యమైన కాల్స్, నోటిఫికేషన్ మిస్ చేయకుండా, మీ నిద్రకు భంగం కలిగకుండా ఉండేందుకు ఈ సెట్టింగ్స్ ఉపయోగపడతాయి.