Clocks tick faster on Moon: చంద్రుడిపై కాలానికి వేగమెక్కువ! ఎంత స్పీడో తెలిస్తే..
ABN , Publish Date - Dec 02 , 2024 | 07:51 PM
థియరీ ఆఫ్ రిలేటివిటీ సిద్ధాంతం ఆధారంగా నిర్వహించిన ఓ అధ్యయనంలో ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. చంద్రుడిపై కాలం వేగంగా కదులుతున్నట్టు నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ స్టాండర్డ్స్ అండ్ టెక్నాలజీకి చెందిన బీజూనాథ్ పాట్లా, నీల్ ఆష్బీ అనే శాస్త్రవేత్తలు గుర్తించారు.
ఇంటర్నెట్ డెస్క్: గురుత్వాకర్షణ శక్తి ప్రభావం కాలంపై ఉంటుందని చెప్పిన శాస్త్రవేత్త ఆల్బర్ట్ ఐన్‌స్టీన్. ఆయన ప్రచురించిన ‘థియరీ ఆఫ్ రిలేటివిటీ’ సిద్ధాంతం ఆధారంగా నిర్వహించిన ఓ అధ్యయనంలో ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. చంద్రుడిపై కాలం ఎంత వేగంగా కదులుతోందో తెలుసుకునేందుకు నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ స్టాండర్డ్స్ అండ్ టెక్నాలజీకి చెందిన బీజూనాథ్ పాట్లా, నీల్ ఆష్బీ అనే శాస్త్రవేత్తలు పరిశోధన చేశారు. వారి అధ్యయనం తాలూకు వివరాలు ది ఆస్ట్రనామికల్ జర్నల్‌లో ప్రచురితమయ్యాయి (Technology).
CERT - In: ప్రభుత్వ హెచ్చరిక.. ఐఫోన్, మ్యాక్‌బుక్‌లను వెంటనే అప్‌డేట్ చేసుకోండి!
పాట్లా, ఆష్బీ అధ్యయనం ప్రకారం, చంద్రుడిపై గడియారాలు భూమ్మీదున్న వాటికంటే ఎక్కువ వేగంతో కదులుతున్నాయి. చంద్రుడి మీదున్న గడియారం రోజుకు 56 మైక్రోసెకెన్ల ఎక్కువ వేగంతో కదులుతోందని వారు గుర్తించారు. చంద్రుడు, భూమి గురుత్వాకర్షణ శక్తి మధ్య తేడాలే ఇందుకు కారణమని తెలిపారు. ఐన్ స్టీన్ సిద్ధాంతం ప్రకారం, చంద్రుడిపై గురుత్వాకర్షణ శక్తి తక్కువగా ఉండటంతో కాలం వేగంగా కదులుతుంది. అదే సమయంలో.. చంద్రుడు భూమి చుట్టూ తిరుగుతున్న కారణంగా అక్కడ కాలం నెమ్మదిస్తుంది. పరస్పర విరుద్ధమైన ఈ రెండిటి కలయిక పర్యవసానంగా చంద్రుడిపై గడియారాలు భూమ్మీదున్న వాటికంటే కాస్తంత వేగంగా కదులుతాయని పేర్కొన్నారు. ఒక మైక్రో సెకన్ అంటే సెకెనులో పది లక్ష వంతు అన్న విషయం తెలిసిందే.
Pixel Laptop: త్వరలో పిక్సెల్ లాప్‌టాప్ లాంచ్ చేయనున్న గూగుల్?
అంతరిక్షంలో వివిధ ప్రాంతాల్లో కాలాల మధ్య బేధాలను అత్యంత కచ్చితత్వం లెక్కించడం అంతరిక్ష ప్రయోగాలకు అవసరమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ అంచనాల్లో ఏ చిన్న తేడా వచ్చినా స్పేస్ మిషన్లు విఫలమవుతాయని హెచ్చరించారు. వివిధ దేశాలు చంద్రుడిపై కాలుమోపేందుకు ప్రయత్నిస్తున్న తరుణంలో అంతరిక్షంలో కాలగణనకు ప్రాముఖ్యత పెరిగింది. చంద్రుడిపైకి వెళ్లే ల్యాండర్లు, రోవర్లకు దిగాల్సిన ప్రాంతాలను కచ్చితంగా తెలియజేయాల్సి ఉంటుంది. ఇందుకోసం కాలాన్ని ఎటువంటి తప్పులు లేకుండా కొలవాలి. సెకెనులో వంద కోట్ల వంతు మేర తేడా వచ్చినా అనర్థం జరిగే అవకాశాలు పెచ్చుమీరుతాయని నాసాకు చెందిన గోడార్డ్ స్పేస్ సెంటర్ ఇంజినీర్ షెరిల్ గ్రామ్లింగ్ తెలిపారు. భూమి, చంద్రుడి మధ్య గడియారాల్లో 56 సెకెన్ల తేడా వల్ల నావిగేషన్‌లో ఏకంగా 17 కిలోమీటర్ల తేడా వచ్చే అవకాశం ఉందని బీజూనాథ్ పాట్లా తెలిపారు.
For More Technology News and Telugu News