Share News

Wi-Fi: వైఫై హ్యాకర్ల బారిన పడకుండా.. ఈ టిప్స్ అనుసరించండి

ABN , Publish Date - Apr 13 , 2024 | 07:41 PM

సాంకేతికత కొత్త పుంతలు తొక్కుతున్న తరుణంలో అదే స్థాయిలో సైబర్ నేరగాళ్లు విజృంభిస్తున్నారు. పర్సనల్ డేటా భద్రత గాలిలో దీపంలా మారింది. వైఫై సాయంతో సైబర్ నేరగాళ్లు వ్యక్తిగత డేటాను చోరీ చేస్తున్న రోజులివి. అలాంటి వైఫైను(Wi-Fi) కాపాడుకోలేకపోతే మీ వ్యక్తిగత డేటా సైబర్ నేరగాళ్ల చేతిలో ఉన్నట్లే. అలాంటి వైఫైని రక్షించుకోవడమూ ముఖ్యమే.

Wi-Fi: వైఫై హ్యాకర్ల బారిన పడకుండా.. ఈ టిప్స్ అనుసరించండి

ఇంటర్నెట్ డెస్క్: సాంకేతికత కొత్త పుంతలు తొక్కుతున్న తరుణంలో అదే స్థాయిలో సైబర్ నేరగాళ్లు విజృంభిస్తున్నారు. పర్సనల్ డేటా భద్రత గాలిలో దీపంలా మారింది. వైఫై సాయంతో సైబర్ నేరగాళ్లు వ్యక్తిగత డేటాను చోరీ చేస్తున్న రోజులివి. అలాంటి వైఫైను(Wi-Fi) కాపాడుకోలేకపోతే మీ వ్యక్తిగత డేటా సైబర్ నేరగాళ్ల చేతిలో ఉన్నట్లే. అలాంటి వైఫైని రక్షించుకోవడమూ ముఖ్యమే.

Wi-Fiని భద్రపరచండిలా..

  • వైఫై రూటర్​ ఇన్​స్టాలేషన్​తో వచ్చే డీఫాల్ట్​ లాగిన్ వివరాలను మార్చుకోవాలి. లేదంటే హ్యాకర్లు చాలా సులువుగా మీ రూటర్​లోని డేటాను చోరీ చేసే అవకాశం ఉంది.

  • రూటర్​ భద్రతంతా వైఫై పాస్​వర్డ్​ మీదే ఆధారపడి ఉంటుంది. కాబట్టి తరచుగా మీ వైఫై పాస్​వర్డ్​ను మారుస్తూ ఉండాలి. స్ట్రాంగ్​ పాస్​వర్డ్​లను సెట్​ చేసుకోవాలి. ఎనిమిది లేదా అంతకంటే పెద్ద అల్ఫాన్యూమరిక్​ పాస్​వర్డ్​ను పెట్టుకోవాలి. అలాగే రూటర్​ పేరు కూడా మార్చాలి.

  • మీ ఇంట్లో వైఫై పాస్​వర్డ్ పొరుగువారికి​ తెలిస్తే వారు, దానిని వాడేసుకునే అవకాశం ఉంటుంది. ఒకవేళ మీరు వైఫై పాస్​వర్డ్​ను​ పక్కింటివారికి చెబితే, ఆ పని పూర్తయిన తరువాత సదరు పాస్​వర్డ్​ను మార్చుకోడవం బెటర్ రిమోట్ యాక్సెస్​‌ని నిలిపివేయాలి.


  • స్మార్ట్​ఫోన్​, ల్యాప్​టాప్​, ​టీవీ తదితర ఎలక్ట్రానిక్ వస్తువులలో ఎవరెవరు మీ వైఫై వాడుతున్నారో లిస్ట్ కనబడుతుంది. ఒకవేళ మీకు తెలియని వ్యక్తులు మీ పాస్​వర్డ్ వాడుతున్నట్లు గుర్తిస్తే, వెంటనే దానిని బ్లాక్ చేయాలి. వెంటనే పాత పాస్​వర్డ్​ను ఛేంజ్​ చేసి కొత్త పాస్​వర్డ్​ను​ సెట్​ చేసుకోవాలి.

  • చాలా వైఫై రూటర్‌లు ఫైర్‌వాల్‌తో ఇన్‌స్టాల్​ అవుతున్నాయి. కొన్ని పాత మోడల్​ రూటర్లలో ఇలా లేదు. అందుకే హ్యాకింగ్​ నుంచి బయటపడాలంటే స్ట్రాంగ్​ ఫైర్​వాల్​ను ఇన్​స్టాల్ చేసుకోవాలి.​

  • మెట్రో, బస్ స్టేషన్, శాపింగ్ మాల్స్ ఇలా చాలా చోట్ల ఫ్రీ వైఫై అందుబాటులో ఉంటుంది. దీన్ని వాడటం అంటే ప్రమాదానికి వెల్‌కం చెప్పినట్లే. ఫ్రీ వైఫై ద్వారా మీ నెట్‌వర్క్‌లోకి సైబర్‌ నేరగాళ్లు ప్రవేశించి హాట్‌స్పాట్‌ను వినియోగిస్తున్న వారందరి డేటాను కూడాను చోరీ చేసే ప్రమాదం ఉంది. కనుక పబ్లిక్ వైఫైను ఎప్పుడూ వాడకూడదు. ఒక వేళ అత్యవసరంగా వాడాల్సి వస్తే, వీపీఎన్​ ఉపయోగించాలి. ఇలా వైఫైకి సంబంధించిన పలు జాగ్రత్తలు తీసుకుంటే మీ వ్యక్తిగత డేటా భద్రంగా ఉంటుంది.

మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Apr 13 , 2024 | 07:44 PM