Share News

Smartphone Battery: ఫోన్ ఛార్జింగ్ త్వరగా అయిపోతోందా.. ఇలా చేయండి

ABN , Publish Date - May 31 , 2024 | 08:26 AM

స్మార్ట్ ఫోన్.. మారుమూల గ్రామాల్లో సైతం దీని వాడకం పెరిగిపోయింది. రోజువారీ కార్యకలాపాల్లో కీలకంగా మారింది. ఆన్‌లైన్ చెల్లింపులు, విద్య, షాపింగ్, ఫుడ్ ఆర్డర్, మనీ ట్రాన్స్‌ఫర్, వినోదం ఇలా ప్రతీదానికి ఫోన్ అవసరం.

Smartphone Battery: ఫోన్ ఛార్జింగ్ త్వరగా అయిపోతోందా.. ఇలా చేయండి

ఇంటర్నెట్ డెస్క్: స్మార్ట్ ఫోన్.. మారుమూల గ్రామాల్లో సైతం దీని వాడకం పెరిగిపోయింది. రోజువారీ కార్యకలాపాల్లో కీలకంగా మారింది. ఆన్‌లైన్ చెల్లింపులు, విద్య, షాపింగ్, ఫుడ్ ఆర్డర్, మనీ ట్రాన్స్‌ఫర్, వినోదం ఇలా ప్రతీదానికి ఫోన్ అవసరం.అయితే మనం ఎన్ని యాప్స్ వాడుతున్నామో.. అంతగా బ్యాటరీ వాడకం ఉంటుంది.

బ్యాక్‌గ్రౌండ్‌లో ఉన్న యాప్స్ వల్ల బ్యాటరీ త్వరగా డ్రైన్ అయిపోతుంది. ఒకసారి ఛార్జింగ్ పెడితే 10 నుంచి 12 గంటలపాటు ఉండాలి. అలా ఉండట్లేదంటే మీరేదో తప్పు చేస్తున్నట్లే. ఫోన్ ఛార్జింగ్ ఎక్కువ సమయం ఉండటానికి ఏం చేయాలంటే..

స్క్రీన్ బ్రైట్‌నెస్..

చాలా మంది స్మార్ట్‌ఫోన్ యూజర్లు స్క్రీన్ బ్రైట్‌నెస్ ఎక్కువ పెట్టి వాడుతుంటారు. పగటిపూటైనా, రాత్రైనా అలాగే చేస్తుంటారు. ఇది త్వరగా బ్యాటరీ డ్రైనింగ్‌కి దారి తీస్తుంది. డిస్‌ప్లే బ్యాటరీని ఎక్కువగా వినియోగిస్తుంది. బ్రైట్‌నెస్ ఎక్కువగా పెట్టుకోవడం కళ్లకు కూడా హాని చేస్తుంది. బ్రైట్‌నెస్‌ని ఆటో మోడ్‌లోఉంచడం ద్వారా బ్యాటరీ ఎక్కువ కాలం వస్తుంది.

బ్యాక్‌గ్రౌండ్ యాప్‌లు..

బ్యాక్‌గ్రౌండ్‌లో ఎక్కువ యాప్‌లు రన్ అవుతూ బ్యాటరీని చాలా వినియోగిస్తాయి. కాబట్టి, మీకు అవసరమైన అప్లికేషన్‌లను మాత్రమే డిస్‌ప్లే‌పై ఉంచుకుని.. బ్యాక్‌గ్రౌండ్‌లో రన్ అవుతున్న అన్ని యాప్‌లను మూసివేయండి.


ఆటోఅప్‌డేట్ ఆప్షన్..

చాలా సార్లు స్మార్ట్‌ఫోన్‌లో ఆటోఅప్‌డేట్ సెట్టింగ్ ఆన్‌లో ఉంటుంది. ఆటో-అప్‌డేట్ కారణంగా, యాప్‌లు ఆటోమేటిక్‌గా అప్‌డేట్ అవుతుంటాయి. అప్‌డేట్ సమయంలో ఛార్జింగ్ వేగంగా దిగిపోతుంది. స్మార్ట్‌ఫోన్ బ్యాటరీ జీవితకాలాన్ని పెంచాలనుకుంటే, వెంటనే ఆటో అప్‌డేట్ సెట్టింగ్‌ను నిలిపివేయండి.

వైఫై..

మీ ఇంట్లో Wi-Fi కనెక్షన్ ఉంటే దాన్నే ఉపయోగించండి. సెల్యులార్ కనెక్షన్‌ని ఉపయోగించడం వల్ల ఎక్కువ బ్యాటరీ ఖర్చవుతుంది. Wi-Fi కనెక్షన్‌ని ఉపయోగించడం ద్వారా మీ ఫోన్ బ్యాటరీ జీవిత కాలాన్ని పెంచుకోవచ్చు.

ఇవి కూడా..

ఫోన్ ఛార్జింగ్ త్వరగా అయిపోయినట్లయితే పవర్ సేవింగ్ మోడ్‌ని ఉపయోగించండి. ఈ సెట్టింగ్‌ని ఆన్ చేసిన వెంటనే, ఫోన్ బ్యాటరీ కొన్ని ముఖ్యమైన అప్లికేషన్‌లకు మాత్రమే పవర్‌ను సరఫరా చేస్తుంది. పవర్ సేవింగ్ మోడ్‌ను ఆన్ చేయడం ద్వారా కొన్ని సేవలను ఉపయోగించలేరు.

For Latest News and National News click here

Updated Date - May 31 , 2024 | 08:26 AM