వక్ఫ్ చట్టాన్ని సవరణతో సమాధి చేస్తే సహించం
ABN , Publish Date - Oct 05 , 2024 | 11:31 PM
వక్ఫ్ చట్టాన్ని సవరణ పేరు తో సమాధి చేయాలని మోదీ ప్రభుత్వం ప్రయత్నం చేస్తోం దని, అది ఎంత మాత్రం సహించబోమని ఆల్ ఇండియా తంజీమే-ఈ-ఇన్సాఫ్ జాతీయ అధ్యక్షుడు, మాజీ ఎంపీ అజీజ్‌పాష హెచ్చరించారు.
- మాజీ ఎంపీ అజీజ్‌పాష
పాలమూరు, అక్టోబరు 5 : వక్ఫ్ చట్టాన్ని సవరణ పేరు తో సమాధి చేయాలని మోదీ ప్రభుత్వం ప్రయత్నం చేస్తోం దని, అది ఎంత మాత్రం సహించబోమని ఆల్ ఇండియా తంజీమే-ఈ-ఇన్సాఫ్ జాతీయ అధ్యక్షుడు, మాజీ ఎంపీ అజీజ్‌పాష హెచ్చరించారు. మహబూబ్‌నగర్‌లో రెండు రోజుల పాటు జరుగుతున్న ఇస్సాఫ్ జాతీయ సమితి సమా వేశాల సందర్భంగా మొదటి రోజు శనివారం ‘వక్ఫ్ అమైం డ్‌మెంట్ యాక్టు-2024’ అంశంపై జాతీయ స్థాయి సెమినా ర్ నిర్వహించారు. అజీజ్‌పాష మాట్లాడుతూ మైనారిటీల హక్కులను కాలరాసే విధంగా కేంద్ర ప్రభుత్వం వ్యవహరి స్తుందన్నారు. దేశంలో రైల్వే, రక్షణ శాఖ తరువాత ఆస్తులు ఉన్నది వక్ఫ్ బోర్డుకేనని ఇది జీర్ణించుకోలేని మోదీ ప్రభు త్వం మైనారిటీలను అణగదొక్కాలని కొత్తచట్టాన్ని తీసుకు వస్తోందన్నారు. ఈ చట్టం విషయంలో లౌకిక ప్రజాస్వా మిక వాదులంతా కలిసికట్టుగా ప్రభుత్వంపై పోరాటం చేయాల్సిన అవసరం ఉందన్నారు. దేశంలో 14 శాతం ఉన్న మైనారిటీలకు 30 శాతం ఆస్తులు ఎందుకనే ఈర్షతోనే ఈ చట్టానికి రూపకల్పన జరిగిందన్నారు. తన ఇంటి మహిళ లను పట్టించుకోని మోదీ మైనారిటీ మహిళలకు తలాక్ లాంటి చట్టాలతో మేలు చేశానని చెప్పటం విడ్డూరమ న్నారు. ప్రధాని తప్పుడు విధానాలతో దేశంలో మతసామ రస్యాన్ని దెబ్బతీసేలా వ్యవహరించడం దుర్మార్గమైన చర్య అన్నారు. రాష్ట్ర మైనారిటీ కార్పొరేషన్ చైర్మన్ ఒబేదుల్లా కొత్వాల్ మాట్లాడుతూ మైనారిటీల ఆస్తులను హరించే విధంగా మోదీ సర్కారు వ్యవహరిస్తుందని ఆరోపించారు. మైనారిటీల హక్కులను కాపాడేందుకు కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంటుందన్నారు. ఆల్ ఇండియా తంజీమే-ఈ- ఇన్సాఫ్ జాతీయ ప్రధాన కార్యదర్శి డాక్టర్ అయూబ్ అలీఖాన్, అలీగఢ్ యూనివర్సిటీ మాజీ వైస్‌చాన్స్‌లర్, ఇన్సా ప్ జాతీయ గౌరవ అధ్యక్షుడు అహ్మద్ షేర్వానీ, ఇర్ఫాన్ అలం, ఇస్లామోద్దీన్, షేకిబుల్ రహమాన్, నవాబ్, నూనిని సాన్, ఫయాజ్, మునీర్‌పటేల్, సీపీఐ జిల్లా కార్యదర్శి బి. బాలకిషన్, వివిధ రాష్ట్రాల ప్రతినిధులు పాల్గొన్నారు.