Share News

CM Revanth: 5 వేల పాఠశాలలను మూసేసిన కేసీఆర్.. సీఎం రేవంత్ ఘాటు వ్యాఖ్యలు

ABN , Publish Date - Oct 11 , 2024 | 05:27 PM

బీఆర్ఎస్ హయాంలో రాష్ట్రవ్యాప్తంగా 5 వేలకుపైగా పాఠశాలలను మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మూసేయించారని సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు. షాద్‌నగర్ నియోజకవర్గం కొందుర్గులో శుక్రవారం రేవంత్ పర్యటించి పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు.

CM Revanth: 5 వేల పాఠశాలలను మూసేసిన కేసీఆర్.. సీఎం రేవంత్ ఘాటు వ్యాఖ్యలు

హైదరాబాద్: బీఆర్ఎస్ హయాంలో రాష్ట్రవ్యాప్తంగా 5 వేలకుపైగా పాఠశాలలను మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మూసేయించారని సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు. షాద్‌నగర్ నియోజకవర్గం కొందుర్గులో శుక్రవారం రేవంత్ పర్యటించి పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా కొందుర్గులో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలకు శంకుస్థాపన చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ.. "దసరా నాలుగు కోట్ల ప్రజలకు సుఖ శాంతులు ఇవ్వాలని కోరుకుంటున్న. ప్రభుత్వం ఏర్పడిన రోజునే వాగ్దానం చేశాం. రాష్ట్రాన్ని విద్యా, వైద్య రంగాల్లో అగ్రగామిగా నిలబెట్టేందుకు కృషి చేస్తామని చెప్పాం. బీఆర్ఎస్ సర్కార్ ఐదు వేల పాఠశాలలను మూసివేసి.. అణగారిన వర్గాలకు విద్యకు దూరం చేసింది. అందుకే ప్రతి పేదవాడికి నాణ్యమైన విద్యను అందించాలని అనుకున్నాం.

అందుకే విద్యా శాఖలో సంపూర్ణంగా మార్పులు చేశాం. కోరుకున్న విధంగా బదిలీలు జరిపాం. ఏ చిన్న పొరపాటు లేకుండా 21 వేల మంది ఉపాధ్యాయులకు పదోన్నతి ఇచ్చాం. అధికారులతోనే ఇది సాధ్యపడింది. ఏడు లక్షల కోట్ల అప్పు చేసిన కేసీఆర్ ఏనాడూ విద్యాభివృద్ధికి కృషి చేయలేదు.


పేదలు చదవకూడదన్నది వారి ఉద్దేశం. PV నరసింహారావు 1971 లో గురుకుల విద్యా వ్యవస్థను తెచ్చారు. అందులో చదివిన ఎంతోమంది నిరుపేదలు పెద్ద పెద్ద స్థానాల్లో ఉన్నారు. బీఆర్ఎస్ హయాంలో ప్రవేశ పెట్టిన గురుకులాల్లో మౌలిక సదుపాయాలు ఉన్నాయా. కనీస వసతులు కల్పించలేదు. ఈ విషయాలు నగ్న సత్యాలు. వీటిని బీఆర్ఎస్ నేతలు తప్పుబడుతున్నారు. బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అంటే నాకు గౌరవం.. మీరు ఎక్కడ ఉంటారో మీ ఇష్టం. కానీ మీరు కూడా పేదలకు విద్య అవసరం లేదని అనుకుంటున్నారా. బీసీ, ఎస్సీ, ఎస్టీలు.. కుల వృత్తులకే పరిమితం కావాలా. పిల్లలకు చదువు చెప్పడం, పేదలకు వైద్యం అందించడం మా విధానం. మీ విధానం, మీరు సీఎం కావడం, కొడుకు, అల్లుడిని మంత్రిని చేయడం, మరొకరిని ఎంపీని చేయడం. వాళ్లందరినీ ఓడించినా బుద్ధి మారలేదు. పేదలందరికీ నాణ్యమైన విద్యనందించేందుకే రెసిడెన్షియల్ పాఠశాలలు పెడుతున్నాం. బీఆర్ఎస్ నేతలకు వారి పార్టీ కార్యాలయాలకు భూమి ఉంటుంది కానీ, బడులు కట్టడానికి భూమి, నిధులు ఉండవు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు వేర్వేరు పాఠశాలలుంటే వారిలో కల్మషాలు పెరగవచ్చు. కనుక అందరినీ ఓకే దగ్గర చదివిస్తే సోదర భావం పెరుగుతుందని ఇలాంటి సమీకృత పాఠశాలలను కట్టాలనే ఆలోచన వచ్చింది" అని రేవంత్ పేర్కొన్నారు.

ఇదికూడా చదవండి: Hyderabad: బెంగళూరు చెరువులు బాగుపడిందెలా?

ఇదికూడా చదవండి: Yadagirigutta: దసరా నుంచి స్వర్ణతాపడం పనులు

ఇదికూడా చదవండి: Hyderabad: అది పరిహారం కాదు.. పరిహాసం: కేటీఆర్‌

ఇదికూడా చదవండి: Manda krishna: వర్గీకరణ తర్వాతే నోటిఫికేషన్లు ఇవ్వాలి

Read Latest Telangana News and National News

Updated Date - Oct 11 , 2024 | 05:27 PM