పాలమూరు అశాంతికి కారణం కాంగ్రెస్ నాయకులే..
ABN , Publish Date - Nov 02 , 2024 | 11:12 PM
బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలపై ఇష్టానుసారంగా అక్రమ కేసులు పెడుతూ.. మరో వైపు స్వేచ్ఛ, ప్రజాపాలన అని చెప్పుకోవడం సిగ్గు చేటని బీఆర్‌ఎస్ నేతలు కాంగ్రెస్‌పై మండి పడ్డారు. Congress leaders are the cause of Palamuru unrest.
మహబూబ్‌నగర్, నవంబరు 2 (ఆంధ్రజ్యోతి): బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలపై ఇష్టానుసారంగా అక్రమ కేసులు పెడుతూ.. మరో వైపు స్వేచ్ఛ, ప్రజాపాలన అని చెప్పుకోవడం సిగ్గు చేటని బీఆర్‌ఎస్ నేతలు కాంగ్రెస్‌పై మండి పడ్డారు. శనివారం జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బీఆర్‌ఎస్ నాయ కులు శ్రీనివాస్‌రెడ్డి, వరదభాస్కర్, పిట్ల సా యిలు మాట్లాడారు. వరదభాస్కర్ సోషల్ మీడి యాలో పోస్టులు పెడితే బీఆర్‌ఎస్ కేసులు పె ట్టించిందని చెబుతున్న మునిసిపల్ చైర్మన్ ఆనంద్‌గౌడ్‌కు, ఇప్పుడు కేసులతోపాటు కొట్టి స్తున్న సంగతి మరిచిపోతున్నారా? అని ప్రశ్నిం చారు. పాలమూరులో అశాంతికి కారకులు మీరు కాదా అని ఎద్దేవా చేశారు. పాల మూరులో ఆనంద్‌గౌడ్‌కు అమరేందర్‌రాజు కు టుంబం మధ్య జరిగిన గొడవనే పాలమూరు అశాంతికి కారణమైందన్నారు. ఈ గొడవలో మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌కు సంబంధం లేద ని, సాయం తీసుకున్న వారే ఇప్పుడు విమ ర్శలకు దిగడం దారుణమన్నారు. కాంగ్రెస్ ప్రభు త్వ హయాంలో స్వేచ్ఛ, నిర్భందం, తప్పుడు కేసు లు ఉండవని చెప్పిన ఎమ్మెల్యే జరుగుతున్న పరిణామాలపై స్పందించాలని డిమాండ్ చేశా రు. ముడా చైర్మన్ లక్ష్మణ్‌యాదవ్ వ్యాఖ్యలు ప్ర జలను రెచ్చగొట్టేలా ఉన్నాయని, దీనిపై పోలీ సులు స్పందించాలని, వెంటనే వ్యాఖ్యలను ఉప సంహరించుకోవాలన్నారు. పార్టీని అంటిపెట్టు కుని ఉన్నారని, పదవి వచ్చిందని మెప్పుకోసం మాట్లాడి ఉన్న పేరును చెడగొట్టుకోవద్దని సూచించారు. సమావేశంలో శివరాజ్, తాటి గణేష్, రాము, సతీష్, అహ్మదుద్దీన్, సత్యం యాదవ్, యాదయ్య పాల్గొన్నారు.