Share News

ప్రజా సమస్యలపై నిరంతర పోరాటం

ABN , Publish Date - Oct 25 , 2024 | 11:33 PM

ప్రజా సమస్యల పరిష్కారం కోసం పార్టీ శ్రేణులు నిరం తర పోరాటాలకు సిద్ధం కావాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు జాన్‌వెస్లీ పిలుపు నిచ్చారు.

ప్రజా సమస్యలపై నిరంతర పోరాటం
మాట్లాడుతున్న రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు జాన్‌వెస్లీ

సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు జాన్‌వెస్లీ

ప్రారంభమైన జిల్లా స్థాయి మహాసభలు

గద్వాల టౌన్‌, అక్టోబరు 25 (ఆంధ్రజ్యోతి) : ప్రజా సమస్యల పరిష్కారం కోసం పార్టీ శ్రేణులు నిరం తర పోరాటాలకు సిద్ధం కావాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు జాన్‌వెస్లీ పిలుపు నిచ్చారు. సీపీఎం జిల్లా స్థాయి మూడవ మహా సభలు శుక్రవారం పట్టణంలోని ప్రైవేట్‌ ఫంక్షన్‌ హాల్‌లో నిర్వహించారు. పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యుడు ఎంవీ రమణ సీపీఎం జెండాను ఆవిష్కరించి మహాసభలను ప్రారంభి ంచారు. పార్టీ అగ్రనాయకులు అమ రవీరుల చిత్రపటాలకు రాష్ట్ర, జిల్లా నాయకులు నివా ళులర్పించారు. అనంతరం జాన్‌వెస్లీ మాటా ్లడుతూ.. పాలకులు ఎవరైనా పెట్టుబడిదారి విధానపు పోకడలే అవలంభించడం పరిపాటిగా మారిందన్నారు. వ్యవస్థలో అసమానతలను ఉండాలని కోరుకో వడం పెట్టుబడిదారి విధానం సహజ లక్షణమని, అందుకు వ్యతిరేకంగా మతోన్మాదం, ఆర్థిక సరళీకరణ విధానాలను ఎండగడుతూ పార్టీ శ్రేణులు ఉద్యమించాల న్నారు. దశాబ్ద కాలంగా దేశంలో సాగుతున్న నిరంకుశ పాలన వల్ల రాజ్యాంగబద్ద సంస్థలన్నీ నిర్వీర్యం కాగా, రాజ కీయ జోక్యం పెరగడంతో విజ్ఞానశాస్త్రం మరు గునపడే ప్రమాదం తలెత్తిందన్నారు. దేశ సమాఖ్య వ్యవస్థకు తూట్లు పొడుస్తూ కేంద్రీ కరణ పాలన దిశగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రాంతీయ పార్టీలు గళం విప్పకపోతే భవిష్యత్‌ పరిణామాలు తీవ్రంగా ఉంటాయన్నారు. రిటైర్ట్‌ ఉపాధ్యాయుడు రామన్‌గౌడ్‌, డాక్టర్‌ మోహన్‌ రావు మాట్లాడుతూ.. వర్తమాన రాజకీ యాల్లో కమ్యూ నిస్టు పార్టీల అవసరం మరింత పెరిగిందన్నారు. అధికారంలో ఉన్నా లేకున్నా ప్రజాపక్షాన పోరాడేది ఎర్రజెండాలు మాత్ర మేనని, కమ్యూనిస్టులు సాగిస్తున్న సమసమాజ నిర్మాణ స్థాపన ఉద్యమానికి ప్రజలు అండగా నిలవాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా కార్య దర్శి వెంకట స్వామి, లక్ష్మన్‌, మధుసూదన్‌, నర్మద, జి.రాజు, వీవీ నర్సింహ, పరంజ్యోతి, మద్దిలేటి, ఈదెన్న, రమేష్‌, ఆంజనేయులు, దేవదాసు, గంగన్న, ఈశ్వర్‌, విజయ్‌కుమార్‌ ఉన్నారు.

Updated Date - Oct 25 , 2024 | 11:33 PM