కోర్టు డ్యూటీ సమర్థవంతంగా నిర్వహించాలి
ABN , Publish Date - Oct 26 , 2024 | 11:23 PM
కోర్టు కేసులలో శిక్షల శాతాన్ని పెంచేలా కోర్టు డ్యూటీ అధికారులు సమర్థవంతంగా పని చే యాలని ఎస్పీ రావుల గిరిధర్ సూచించారు.
కేసుల దర్యాప్తులో సాక్ష్యాధారాల నమోదు కీలకం
ఎస్పీ రావుల గిరిధర్
వనపర్తి క్రైమ్, అక్టోబరు26 (ఆంధ్రజ్యోతి) : కోర్టు కేసులలో శిక్షల శాతాన్ని పెంచేలా కోర్టు డ్యూటీ అధికారులు సమర్థవంతంగా పని చే యాలని ఎస్పీ రావుల గిరిధర్ సూచించారు. శని వారం జిల్లా పోలీస్ కార్యాలయంలో కోర్టు డ్యూ టీ కానిస్టేబుళ్లతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. తప్పు చేసిన నిందితులకు శిక్ష పడేలా చేయడం ద్వారా ప్రజ లకు శాఖపై మరింత గౌరవం, నమ్మకం పెరుగు తుందని అన్నారు. పెండింగ్‌లో ఉన్న కేసులు, కోర్టు క్యాలెండర్, నాన్ బెయిలబుల్ వారెంట్స్, స మన్స్ తదితర అంశాలను సమీక్షించారు. కోర్టు అధికారులు సమన్వయంతో పని చేయడం ద్వా రా సాక్షులను, నిందితులను, బాధితులను సమ యానికి కోర్టులో హాజరు పరిచేలా చూసు కోవాలన్నారు. కోర్టు విధులకు సంబంధించి పక్కా ప్రణాళికను అవలంభించాలని, కేసు ట్ర యల్స్‌లో సీడీలు నమోదు చేసుకోవాలన్నారు. బాధితులకు, సాక్షులకు కేసుకు సంబంధించిన విషయాలలో అవగాహన కల్పించాలని తెలిపా రు. నిందితులకు శిక్షలు పడినప్పుడే నేరాల ని యంత్రణ సాధ్యమవుతుందన్నారు. సమావేశం లో డీఎస్పీ వెంకటేశ్వరరావు, స్పెషల్ బ్రాంచ్ ఇన్‌స్పెక్టర్ నరేష్, స్పెషల్ బ్రాంచ్ ఎస్‌ఐ శివకుమార్, డీసీఆర్‌బీ ఎస్‌ఐ రవి ప్రకాష్, జిల్లా కోర్టు లైజర్ హెడ్ కానిస్టేబుల్ సత్యం, పలువురు అధికారులు పాల్గొన్నారు.