జోగుళాంబ ఆలయంలో భక్తుల రద్దీ
ABN , Publish Date - Nov 01 , 2024 | 11:48 PM
అలంపూరు పుణ్యక్షేత్రంలో వెలసిన జోగుళాంబ బాల బ్రహ్మే శ్వర స్వామి వారి ఆలయాల్లో శుక్ర వారం దీపావళి, అమావాస్య సంద ర్భంగా భక్తుల రద్దీ నెలకొంది. Crowd of devotees at Jogulamba Temple
అలంపూరు నవంబరు 1 (ఆంధ్ర జ్యోతి): అలంపూరు పుణ్యక్షేత్రంలో వెలసిన జోగుళాంబ బాల బ్రహ్మే శ్వర స్వామి వారి ఆలయాల్లో శుక్ర వారం దీపావళి, అమావాస్య సంద ర్భంగా భక్తుల రద్దీ నెలకొంది. భక్తు లు తుంగభద్రనది తీరాన పుష్కర ఘాట్‌లో స్నానాలు ఆచరించి, దీపా లు వదిలి స్వామివారి ఆలయంలో గణపతి పూజ, అభిషేకం, అమ్మవారి ఆలయంలో కుంకుమార్చనలు చేశా రు. మహిళలు త్రిశతి ఖడ్గ మాలలు, చీరలు, గాజులు, వడిబియ్యం సమ ర్పించి మొక్కుబడులను చెల్లించారు.
జోగుళాంబ అమ్మవారి ఆలయంలో శుక్రవారం 176 చండీహోమం, రుద్ర హోమాలు దేవస్థానం వారు నిర్వ హించారు. ఉదయం 9 గంటలకు ప్రారంభమైన హోమాలు మఽధ్యా హ్నం 12 గంటలకు పూర్ణాహుతితో అయ్యాయని, శనివారం ప్రారంభమ య్యే కార్తీక మాసం పూజలకు ప్రత్యే క సౌకర్యాలు కల్పిస్తున్నట్లు ఆలయ ఈవో పురేందర్ కుమార్ తెలిపారు.