కులగణనలో వివరాలు నమోదు చేసుకోండి
ABN , Publish Date - Nov 02 , 2024 | 11:13 PM
సామాజిక, ఆర్థిక సర్వే(కులగణన)లో ముస్లింలు వివ రాలు నమోదు చేసుకోవాలని మిల్లీ మహాజ్ మహబూబ్‌నగర్ చీఫ్ ప్యాట్రన్ ఖాజా ఫయాజుద్దీన్ అన్వర్‌పాష సూచించారు.
-మిల్లీ మహాజ్ చీఫ్ ప్యాట్రన్ ఖాజాఫయాజుద్దీన్
మహబూబ్‌నగర్ అర్బన్, నవంబ రు2 (ఆంధ్రజ్యోతి): సామాజిక, ఆర్థిక సర్వే(కులగణన)లో ముస్లింలు వివ రాలు నమోదు చేసుకోవాలని మిల్లీ మహాజ్ మహబూబ్‌నగర్ చీఫ్ ప్యాట్రన్ ఖాజా ఫయాజుద్దీన్ అన్వర్‌పాష సూచించారు. శనివా రం జిల్లా కేంద్రంలోని సంఘం కార్యాలయంలో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీసీ-ఈలో ఉన్న ముస్లిం లు ప్రత్యేకంగా సర్వేలో రాయించుకోవాలని సూచించారు. ఆదేవిధంగా సయ్యద్, పఠాన్, ఖాన్ తదితర ముస్లింలను దారిద్య్రరేఖకు దిగు వన ఉన్నారని వారిని బీసీ-ఈలో చేర్చాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. బీసీ కమిషన్ జిల్లాలో పర్యటించనుందని, బీసీ-ఈ రిజర్వేషన్ పది శాతం పెంచాలని డిమాండ్ చేయాలని వివిధ రాజకీయా పార్టీలను కోరారు. సమా వేశంలో తఖీహుస్సేన్, హాఫిజ్‌ఇద్రీస్, ఖుద్దుస్ బేగ్, అబ్దుల్లా, తయ్యబ్‌బశ్వర్, అమీర్, హకీం పాల్గొన్నారు.