Share News

ఢిల్లీ పరిస్థితి రాకూడదనే ఈవీ పాలసీ: పొన్నం

ABN , Publish Date - Nov 20 , 2024 | 04:22 AM

దేశ రాజధాని ఢిల్లీలో కాలుష్య తీవ్రత కారణంగా పాఠశాలలు మూసివేశారని, హైదరాబాద్‌తో పాటు రాష్ట్రంలో ఎక్కడా అలాంటి సమస్యలు

ఢిల్లీ పరిస్థితి రాకూడదనే ఈవీ పాలసీ: పొన్నం

హైదరాబాద్‌, నవంబరు 19 (ఆంధ్రజ్యోతి): దేశ రాజధాని ఢిల్లీలో కాలుష్య తీవ్రత కారణంగా పాఠశాలలు మూసివేశారని, హైదరాబాద్‌తో పాటు రాష్ట్రంలో ఎక్కడా అలాంటి సమస్యలు ఉత్పన్నం కాకుండా ముందు జాగ్రత్తగా ఎలక్ట్రిక్‌ వాహనా(ఈవీ)ల పాలసీ తీసుకువచ్చినట్టు రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ పేర్కొన్నారు. కాలుష్యం వెదజల్లే వాహనాలను నియంత్రించేందుకు కఠినంగా వ్యవహరించాలని ఆయన అధికారులను ఆదేశించారు. కాలుష్యాన్ని తగ్గించేందుకు 15 సంవత్సరాలు దాటిన పాత మోటారు వాహనాలను స్వచ్ఛందంగా స్ర్కాప్‌కు పంపాలని వాహనదారులకు సూచించారు. అలాగే ఎలక్ట్రిక్‌ వాహనాలను విస్తృతంగా వినియోగించేందుకు అనువుగా ఈవీ పాలసీ ఉందని ఆయన మంగళవారం విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు. ప్రభుత్వ ఖజానాకు నష్టం వచ్చినప్పటికీ మరో రెండేళ్ల వరకు ఈవీలపై రోడ్డు టాక్స్‌ రిజిరేస్టషన్‌ ఫీజు 100ు మినహాయింపు ఇస్తున్నట్టు గుర్తుచేశారు.

Updated Date - Nov 20 , 2024 | 04:22 AM