Share News

హైడ్రాకు ముగ్గురు డిప్యూటీ ఈఈలు

ABN , Publish Date - Sep 25 , 2024 | 03:24 AM

హైదరాబాద్‌ విపత్తుల స్పందన, ఆస్తుల పరిరక్షణ సంస్థ(హైడ్రా)కు ముగ్గురు డిప్యూటీ ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్లు(డిప్యూటీ ఈఈ)లను డిప్యూటేషన్‌పై పంపించాలని నీటిపారుదల శాఖ నిర్ణయించింది.

హైడ్రాకు ముగ్గురు డిప్యూటీ ఈఈలు

హైదరాబాద్‌, సెప్టెంబరు 24 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్‌ విపత్తుల స్పందన, ఆస్తుల పరిరక్షణ సంస్థ(హైడ్రా)కు ముగ్గురు డిప్యూటీ ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్లు(డిప్యూటీ ఈఈ)లను డిప్యూటేషన్‌పై పంపించాలని నీటిపారుదల శాఖ నిర్ణయించింది. తెలంగాణ నీటిపారుదల చట్టంలోని కొన్ని అధికారాలను హైడ్రాకు బదలాయించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విష యం విదితమే. దాంతో హైడ్రాకు డిప్యూటేషన్‌పై వెళ్లదలుచుకున్న డీఈఈలు ఈ నెల 30వ తేదీలోగా సంబంధిత ఈఎన్‌సీ/సీఈలకు విజ్ఞప్తి చేసుకోవాలని ఈఎన్‌సీ(అడ్మిన్‌) జి.అనిల్‌కుమార్‌ సూచించారు.

Updated Date - Sep 25 , 2024 | 03:24 AM