Share News

సమస్యల పరిష్కారంలో జర్నలిస్టులే కీలకం

ABN , Publish Date - Oct 27 , 2024 | 11:55 PM

ప్రజాసమస్యల పరిష్కారంలో జర్నలిస్టులే కీలకమని కలెక్టర్‌ సిక్తా పట్నాయక్‌ అన్నారు.

సమస్యల పరిష్కారంలో జర్నలిస్టులే కీలకం
మాట్లాడుతున్న కలెక్టర్‌ సిక్తా పట్నాయక్‌

- కలెక్టర్‌ సిక్తా పట్నాయక్‌

నారాయణపేట టౌన్‌, అక్టోబర్‌ 27 (ఆంధ్రజ్యోతి) : ప్రజాసమస్యల పరిష్కారంలో జర్నలిస్టులే కీలకమని కలెక్టర్‌ సిక్తా పట్నాయక్‌ అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని శాసన్‌ పల్లి రోడ్‌ ఫంక్షన్‌హాల్‌లో టీయూడబ్లూజే (ఐజేయూ) జిల్లా ప్రథమ మహాసభను జిల్లా కన్వీనర్‌ నారాయణరెడ్డి అధ్యక్షతన నిర్వహిం చారు. ముఖ్యఅతిథులుగా కలెక్టర్‌, టీయూ డబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షుడు విరాహత్‌ అలీ, ఎస్పీ యోగేష్‌ గౌతమ్‌ తదితరులు హజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ గత ఎన్నికల్లో జిల్లా జర్నలిస్టులు చేసిన కృషి వల్లే ప్రశాంత వాతావరణంలో పూర్తయ్యాయని గుర్తుచేశారు. వెనుకబడిన నారాయణపేట జిల్లాకు జర్నలిస్టుల సహకారం ఎంతో అవసరం ఉందన్నారు. రాష్ట్ర అధ్యక్షుడు విరాహత్‌ అలీ మాట్లాడుతూ జిల్లాలో 200పైగా తమ యూనియన్‌కు జర్నలిస్టులు మద్దతుగా ఉన్నారంటే రాష్ట్రంలోని 119 నియో జకవర్గాల్లో ఎంత మంది ఉంటారో మాటల్లో చెప్పనక్కర్లేదన్నారు. జర్నలిస్టుల వృత్తి భద్రత, మీడియా గౌరవం, వర్కింగ్‌ జర్నలిస్టుల సంక్షే మమే తమ ధ్యేయమన్నారు. ఎస్పీ మాట్లా డుతూ.. రాబోయే రోజుల్లో మనమంతా కలిసి కట్టుగా ఉంటూ శాంతిభద్రతలను పరిరక్షించు కుందామని పేర్కొన్నారు. అనంతరం జిల్లా కార్య వర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. రాష్ట్ర కార్యదర్శి మధుగౌడ్‌, వెంకట్‌, జెమిని శేఖర్‌, డీసీసీ అధ్యక్షుడు ప్రశాంత్‌రెడ్డి, రామాంజ నేయులు, కన్నయ్య, భీంసేన్‌రావు, చేగూరి నర్సిం హులు, శ్రీనివాస్‌, కౌన్సిలర్‌ మహేష్‌, రాము, కాశీనాథ్‌, జర్నలిస్టులు పాల్గొన్నారు.

Updated Date - Oct 27 , 2024 | 11:56 PM