Share News

రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు

ABN , Publish Date - Oct 23 , 2024 | 11:33 PM

జిల్లాలో రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ ఆదర్శ్‌ సురభి అధికారులను ఆదేశించారు.

రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు
మాట్లాడుతున్న కలెక్టర్‌ ఆదర్శ్‌ సురభి, చిత్రంలో అధికారులు

- కలెక్టర్‌ ఆదర్శ్‌ సురభి

- అధికారులతో సమీక్ష

వనపర్తి రాజీవ్‌చౌరస్తా, అక్టోబరు23 (ఆంధ్రజ్యోతి) : జిల్లాలో రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ ఆదర్శ్‌ సురభి అధికారులను ఆదేశించారు. బుధవారం ఐడీ వోసీ సమావేశ మందిరంలో రోడ్లు భవనాల శాఖ ఆధ్వర్యంలో కలెక్టర్‌ అధ్యక్షతన రోడ్డు భద్రతా కమిటీ సమావేశం నిర్వహించారు. ఎస్పీ గిరిధర్‌ తరపున జిల్లాలోని అన్ని మండలాల స్టేషన్‌ హౌస్‌ ఆఫీసర్లు తమ పరిధిలో ఉన్న రోడ్లు ప్రమాద స్థలాలను గుర్తించి ప్రమాదాల నివార ణకు తీసుకోవాల్సిన చర్యలపై పవర్‌పాయింట్‌ ప్రజెంటేషన్‌ ఇచ్చారు. ముఖ్యంగా వనపర్తి జిల్లా ద్వారా వెళ్తున్న జాతీయ రహదారిపై బ్లాక్‌ స్పాట్‌లను, జిల్లా రహదారులు, మునిసిపాలిటీల్లో గల రోడ్డు ప్రమాదాల స్థలాలను గుర్తించినట్లు అధికారులు తెలిపారు. జాతీయ రహదారిపై వెల్టూరు జంక్షన్‌, పాలెం జంక్షన్‌, మదర్‌ థెరిస్సా కొత్తకోట కూడలి, అమడబాకుల, నాటవెళ్లి, తోమాలపల్లి, ఆనంద భవన్‌ జంక్షన్‌ పెబ్బేరు, మోడల్‌ హై స్కూల్‌ పెబ్బేరు, రంగాపూర్‌ కూడలిలను ప్రధాన ప్రమాద స్థలాలుగా గుర్తించినట్లు పేర్కొన్నారు. గుర్తించిన ఈ బ్లాక్‌ స్పాట్‌లలో సూచిక బోర్డులు, బ్లింకింగ్‌ లైట్లు, హై మాస్ట్‌ లైట్స్‌, వాహనాల పార్కింగ్‌ స్థలం వంటివి ఏర్పాటు చేయాలని కలెక్టర్‌ అధికారులను ఆదేశించారు. పెళ్లి పెద్దలు, బ్రాహ్మణులకు, ముస్లింలకు పెళ్లి చేసే పెద్దకు, పాస్టర్లకు బాల్య వివాహాలపై అవగాహన కల్పించాలని, వారు దగ్గరుండి పెళ్లి చేస్తే కేసులు చేయాలని ఆదేశించారు. ఎస్పీ మాట్లాడుతూ.. రోడ్డు ప్రమా దాల నియంత్రణపై అవగాహన కోసం కొత్తకో టలో ట్రాఫిక్‌ శిక్షణ కేంద్రం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. అవసరమైన సీసీ కెమెరాలు సమకూర్చుకునేందుకు కలెక్టర్‌ అవసరమైన మేరకు నిధులు మంజూరు చేస్తున్నందుకు కృతజ్ఞతలు తెలిపారు.

భూ సేకరణ ప్రక్రియ వేగవంతం చేయాలి

జిల్లాలోని నీటి పారుదల ప్రాజెక్టులకు సంబం ధించిన భూ సేకరణ ప్రక్రియ వేగవంతం చేయా లని కలెక్టర్‌ ఆదర్శ్‌ సురభి ఆదేశించారు. బుధ వారం కలెక్టరేట్‌లోని కాన్ఫరెన్స్‌ హాల్‌లో భూ సేకరణ అంశాలకు సంబంధించి రెవెన్యూ, ఇరిగే షన్‌, పంచాయతీ రాజ్‌, ఇంజనీరింగ్‌ అధికారు లతో సమీక్ష నిర్వహించారు. గణప సముద్రం రిజర్వాయర్‌ బ్రాంచ్‌ కెనాల్‌కు సంబంధించి 197 ఎకరాలకు నవంబరు 20లోపు సర్వే పూర్తి చేయా లని ఆదేశించారు. రాజీవ్‌ భీమా లిఫ్ట్‌ ఇరిగేషన్‌ ప్రాజెక్టు, 27 ప్యాకేజీ కింద భూసేకరణ అవార్డు జారీ ప్రక్రియ నవంబర్‌ చివరి నాటికి పూర్తి చేయాలన్నారు. ఘణపురం బ్రాంచ్‌ కెనాల్‌లో కర్నె తండా పార్ట్‌లో 171 ఎకరాలు సర్వే కూడా వేగంగా పూర్తి చేయాలని ఆదేశించారు.

Updated Date - Oct 23 , 2024 | 11:33 PM