Bathukamma Celebrations: చిత్తు చిత్తుల బొమ్మ.. అంబరాన్నంటిన బతుకమ్మ సంబురాలు
ABN , Publish Date - Oct 10 , 2024 | 06:52 PM
తెలంగాణ వ్యాప్తంగా బతుకమ్మ(Bathukamma Celebrations) సంబురాలు అంబరాన్నంటాయి. గురువారం చివరి రోజైన సద్దుల బతుకమ్మ కావడంతో తెలంగాణ గల్లీగల్లీ నుంచి హైదరాబాద్ బస్తీల వరకు వేడుకలు ఆకాశాన్నంటాయి.
హైదరాబాద్: తెలంగాణ వ్యాప్తంగా బతుకమ్మ(Bathukamma Celebrations) సంబురాలు అంబరాన్నంటాయి. గురువారం చివరి రోజైన సద్దుల బతుకమ్మ కావడంతో తెలంగాణ గల్లీగల్లీ నుంచి హైదరాబాద్ బస్తీల వరకు వేడుకలు ఆకాశాన్నంటాయి. ఇటు ట్యాంక్‌బండ్ పరిసరాల్లో మంత్రి సీతక్క సహ పలువురు మహిళ నేతలు, మహిళలు, యువతులు పెద్ద ఎత్తున తరలివచ్చి బతుకమ్మ సంబరాల్లో పాల్గొనగా.. మరోపక్క ఊరూవాడా పూలవనంలా మారిపోయింది. మహిళలు, యువతులు, చిన్నారుల ఆటపాటలతో రాష్ట్ర వ్యాప్తంగా సందడి వాతావరణం నెలకొంది. అక్టోబర్ 2న ఎంగిలిపూల బతుకమ్మతో ప్రారంభమైన ఉత్సవాలు సద్దుల బతుకమ్మతో ముగుస్తున్నాయి.
రాష్ట్ర ఆవిర్భావం నుంచే బతుకమ్మ సంబురాలను ప్రభుత్వం ఘనంగా నిర్వహిస్తోంది. దీంతోపాటు బతుకమ్మను రాష్ట్ర పండుగగా గుర్తించి గౌరవించింది. బతుకమ్మల నిమజ్జనానికి ఊళ్లలో ఉండే చెరువులతో పాటు హైదరాబాద్ వాసులు తమ సమీప నీటి వనరులను ఉపయోగించుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు రాజ్‌భవన్‌లో జరిగిన బతుకమ్మ వేడుకల్లో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, సతీమణి సుధాదేవ్ పాల్గొన్నారు. గవర్నర్‌గా నియమితులైన తర్వాత తొలిసారి సంబురాలు జరుపుకుంటుండడంతో పూల పండుగ విశిష్టతను అధికారులు గవర్నర్ దంపతులకు అధికారులు వివరించారు.