Share News

ఎల్‌ఆర్‌ఎస్‌ దరఖాస్తులు పరిష్కరించండి

ABN , Publish Date - Oct 25 , 2024 | 11:31 PM

గ్రామ స్థాయిలో పెండింగ్‌లో ఉన్న ఎల్‌ఆర్‌ఎస్‌ దరఖాస్తులను పరిష్కరించేందుకు కార్యదర్శులు, రెవెన్యూ ఇన్‌స్పెక్టర్లు, ఇరిగేషన్‌ ఏఈలు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్‌ బీఎం సంతోష్‌ ఆదేశించారు.

ఎల్‌ఆర్‌ఎస్‌ దరఖాస్తులు పరిష్కరించండి
అధికారులతో మాట్లాడుతున్న కలెక్టర్‌ సంతోష్‌

కలెక్టర్‌ సంతోష్‌

గద్వాల న్యూటౌన్‌, అక్టోబరు 25 (ఆంధ్రజ్యోతి): గ్రామ స్థాయిలో పెండింగ్‌లో ఉన్న ఎల్‌ఆర్‌ఎస్‌ దరఖాస్తులను పరిష్కరించేందుకు కార్యదర్శులు, రెవెన్యూ ఇన్‌స్పెక్టర్లు, ఇరిగేషన్‌ ఏఈలు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్‌ బీఎం సంతోష్‌ ఆదేశించారు. శుక్రవారం ఐడీవోసీ కాన్ఫరెన్స్‌ హాలులో ఏర్పాటు చేసిన సమావేశంలో కలెక్టర్‌ మాట్లాడారు. ప్రతి దరఖాస్తుదారుడికి ఫోన్‌ చేసి అవసరమైన సమాచారం సేకరించుకొని వెంటనే పరిష్కరించాలన్నారు. సకాలంలో స్పందించని వారిని గుర్తించి జాబితా తయారు చేయాలని ఆదేశించారు. ఎంపీవోలు ప్రతి రోజు కనీసం వంద ఎల్‌ఆర్‌ఎస్‌ దరఖాస్తుదారులకు స్వయంగా ఫోన్‌ చేయాలన్నారు. అసిస్టెంట్‌ ఇంజనీర్లు, రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ల పరిధిలో ఎల్‌ఆర్‌ఎస్‌ దరఖాస్తుల సంఖ్య ఎక్కువగా ఉన్నందున వాటిని వేగంగా పూర్తి చేయాలన్నారు. ఆర్‌ఐలు దరఖాస్తులను క్షేత్ర స్థాయిలో పరిశీలించి నిషేధిత, కోర్టు కేసులు, ప్రభుత్వ భూములు, సీలింగ్‌ భూముల అంశాలపై నమోదు చేయాలన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ లక్ష్మీనారాయణ, ప్రత్యేక అదనపు కలెక్టర్‌ శ్రీనివాసరావు, డీపీవో శ్యాంసుందర్‌, ఇరిగేషన్‌ ఈఈ శ్రీనివాసరావు, టౌన్‌ ప్లానింగ్‌ అధికారి కుర్మన్న తదితరులు ఉన్నారు.

Updated Date - Oct 25 , 2024 | 11:31 PM