Share News

Trending: హాలీవుడ్‌తో పోటీ.. ప్రభాస్‌పై రేవంత్ ప్రశంసలు..

ABN , Publish Date - Aug 19 , 2024 | 10:33 AM

పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్‌ పాపులారిటీ రోజురోజుకు పెరుగుతోంది. బహుబలితో విశ్వవ్యాప్తంగా పేరుసంపాదించిన ప్రభాస్.. సూపర్ హిట్స్‌తో దూసుకుపోతున్నాడు. ప్రభాస్ నటనకు అంతర్జాతీయ స్థాయి నటులు సైతం ఫిదా అవుతున్నారు.

Trending: హాలీవుడ్‌తో పోటీ.. ప్రభాస్‌పై రేవంత్ ప్రశంసలు..
Prabhas

పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్‌ పాపులారిటీ రోజురోజుకు పెరుగుతోంది. బహుబలితో విశ్వవ్యాప్తంగా పేరుసంపాదించిన ప్రభాస్.. సూపర్ హిట్స్‌తో దూసుకుపోతున్నాడు. ప్రభాస్ నటనకు అంతర్జాతీయ స్థాయి నటులు సైతం ఫిదా అవుతున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ప్రభాస్ ఫ్యాన్స్‌ను సంపాదించుకుంటున్నాడు. ప్రస్తుతం తెలుగు నటుల్లో ఎక్కువ పాపులారిటీ పొందుతున్న నటుల్లో ప్రభాస్ ఒకరు. తాజాగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సైతం ప్రభాస్ నటనపై ప్రశంసల వర్షం కురిపించారు. ప్రభాస్ నటనకు సాటిరారు మరెవరంటూ ఆయనను పొగడ్తలతో ఆకాశానికెత్తేశారు. హైదారాబాద్‌లో క్షత్రియ సేవా సమితి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన అభినందన సభ కార్యక్రమంలో రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభాస్‌పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. క్షత్రియ సామాజికవర్గం నుంచి సినీ రంగంలో ఉన్నతస్థాయి ఎదిగిన వ్యక్తుల్లో కృష్ణంరాజు ఒకరన్నారు. ఆయన పేరు లేకుండా తెలుగు సినిమా పేరు చెప్పలేమన్నారు. ప్రస్తుతం కృష్ణంరాజు సజీవంగా మన మధ్య లేకపోయినా ఆయన నటన ఎప్పటికీ ప్రజల్లో గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతుందన్నారు. ప్రభాస్ లేకుండా బహుబలి సినిమాని ఊహించలేమన్నారు రేవంత్ రెడ్డి. కృష్ణంరాజుతో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూనే ప్రభాస్‌ను ప్రశంసలతో ముంచెత్తారు. కృష్ణంరాజు తనతో మాట్లాడేటప్పుడు అనేక విషయాలను పంచుకునేవారని, ఆయన సినీ, రాజకీయ రంగాల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపును తీసుకువచ్చారన్నారు.


ప్రభాస్‌పై ప్రశంసలు..

ప్రభాస్ హలీవుడ్‌తో పోటీపడుతున్నారని రేవంత్ రెడ్డి అన్నారు. టాలీవుడ్, బాలీవుడ్‌ను మించి హాలీవుడ్‌తో పోటీపడే స్థాయికి ప్రభాస్ చేరుకోవడం వెనుక ఎంతో శ్రమ దాగి ఉందన్నారు. క్షత్రియ సామాజిక వర్గం నుంచి వచ్చి సినిమా రంగంలో అగ్రస్థాయికి చేరుకున్న నటుల్లో ప్రభాస్ ఒకరంటూ రేవంత్ రెడ్డి ప్రశంసించారు. తాను ఈ స్థాయికి రావడానికి ఎంతో కష్టపడి ఉంటారని.. నేటి యువత సైతం ప్రభాస్ లాంటి వ్యక్తులను ఆదర్శంగా తీసుకుని.. తమ తమ రంగాల్లో ఉన్నత శిఖరాలకు ఎదగాలన్నారు. పట్టుదల, శ్రమ, నిబద్ధత ఉంటే అనుకున్న లక్ష్యాలను వేగంగా సాధించగలమని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.


అభివృద్ధిలో క్షత్రియుల పాత్ర..

దేశంలోని పలు రంగాల అభివృద్ధిలో క్షత్రియుల పాత్ర ఎంతో ఉందన్నారు. నిస్వార్థంగా సేవ చేసే వ్యక్తులు ఎక్కువుగా ఉండే సామాజికవర్గం క్షత్రియులని కొనియాడారు. విజయానికి, విశ్వాసానికి క్షత్రియులు మారుపేరంటూ.. ఇదే సామాజిక వర్గానికి చెందిన ప్రభాస్‌.. తెలుగు సినిమా ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేశారని కొనియాడారు. అలాగే క్షత్రియ సామాజిక వర్గానికి చెందిన బోసురాజు కర్ణాటక, తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్‌ విజయంలో కీలకపాత్ర పోషించారని గుర్తుచేశారు.

మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Read More Telugu Latest News Click Here

Updated Date - Aug 19 , 2024 | 10:45 AM