Share News

Jani Master: పోలీసులకు పట్టుబడ్డ జానీ మాస్టర్.. ఎలా, ఎక్కడ దొరికాడంటే

ABN , Publish Date - Sep 19 , 2024 | 12:47 PM

ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌పై అత్యాచారం కేసులో కీలక పరిణామం చోటుచేసుుకుంది. జానీ మాస్టర్‌ని పోలీసులు గోవాలో అరెస్టు చేశారు. గోవా కోర్టులో జానీ మాస్టర్‌ని పోలీసులు హాజరుపరుస్తున్నారు.

Jani Master: పోలీసులకు పట్టుబడ్డ జానీ మాస్టర్.. ఎలా, ఎక్కడ దొరికాడంటే

హైదరాబాద్: ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌పై (Jani Master) అత్యాచారం కేసులో కీలక పరిణామం చోటుచేసుుకుంది. జానీ మాస్టర్‌ని పోలీసులు గోవాలో అరెస్టు (Jani Master Arrested) చేశారు. గోవా కోర్టులో ఆయనని పోలీసులు హాజరుపరచనున్నారు. అనంతరం పీటీ వారెంట్ కింద హైదరాబాద్‌కు తరలించనున్నారు.

కాగా జానీ మాస్టర్ బెంగళూరు నుంచి గోవా వెళ్లినట్టు గుర్తించారు. అతడిని అరెస్ట్ చేసేందుకు ఎస్‌వోటీ, నార్సింగి పోలీసులు రంగంలోకి దిగి ఆపరేషన్ చేపట్టారు. గోవాలో ఉన్నట్టు ట్రాక్ చేశారు. అక్కడ ఓ లాడ్జ్‌లో ఉన్నట్టు నిర్ధారించుకొని ఎస్‌వోటీ పోలీసులు వెళ్లి పట్టుకున్నారు. బాధిత యువతి కేసు పెట్టిన నాటి నుంచి 5 రోజులుగా జానీ మాస్టర్ ఫోన్ స్విచ్ఛాఫ్ వస్తోంది. పరారవడంతో చాకచక్యంగా వివరాలు సేకరించి అతడి ఆచూకీని కనిపెట్టారు. అతడి ఆచూకీ కోసం మొత్తం 4 ప్రత్యేక పోలీసు బృందాలు రంగంలోకి దిగాయి. నెల్లూరుతోపాటు ముంబై, ఢిల్లీలో ఆయన కోసం గాలించాయి. ఎట్టకేలకు ఆయన ముంబైలో ఉన్నట్టు గుర్తించారు.


మరోవైపు.. లైంగిక దాడి కేసు పెట్టిన యువతి మైనర్‌గా ఉన్నప్పుడే జానీ మాస్టర్‌ లైంగిక దాడికి ప్రయత్నించినట్టు ఫిర్యాదులో పేర్కొనడంతో కేసును పోక్సో కేసుగా మార్చే అవకాశం ఉందంటూ కథనాలు వినపడుతున్నాయి. ఇందుకు సంబంధించిన ఆధారాలను సేకరించే పనిలో పోలీసులు ఉన్నట్టు తెలుస్తోంది.


మహిళా కమిషన్‌కు ఫిర్యాదు..

జానీ మాస్టర్‌పై లైంగిక దాడి వ్యవహారం మహిళా కమిషన్ దృష్టికి కూడా చేరింది. ఈ మేరకు జానీ మాస్టర్‌ అలియాస్‌ షేక్‌ జానీబాషాపై మహిళా కమిషన్‌లోనూ ఫిర్యాదు నమోదైంది. బాధిత యువతిని పలు మహిళా సంఘాల నాయకులు బుధవారం కలిశారు. అనంతరం లైంగిక వేధింపుల వివరాలను పేర్కొంటూ 40 పేజీలతో కూడిన లేఖను మహిళా కమిషన్‌లో బాధితురాలు ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదు కమిషన్‌ పరిగణనలోకి తీసుకుంది. న్యాయం చేస్తామని హామీ ఇచ్చింది.

Updated Date - Sep 19 , 2024 | 01:25 PM