కొలువుదీరిన ‘జోగుళాంబ’ పాలకమండలి
ABN , Publish Date - Oct 04 , 2024 | 11:23 PM
అలంపూర్ జోగు ళాంబ బాలబ్రహ్మేశ్వర దేవస్థాన నూతన పాలక మండలి శుక్రవారం ఏర్పాటైంది. 13 మంది సభ్యులు గా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
- అమ్మవారి సన్నిధిలో ప్రమాణ స్వీకారం చేసిన చైర్మన్, సభ్యులు
అలంపూర్ చౌరస్తా, అక్టోబరు 4: అలంపూర్ జోగు ళాంబ బాలబ్రహ్మేశ్వర దేవస్థాన నూతన పాలక మండలి శుక్రవారం ఏర్పాటైంది. 13 మంది సభ్యులు గా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఆలయ ఈవో పురే ందర్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏఐసీసీ కార్యదర్శి సంపత్‌కుమార్, జెడ్పీ మాజీ చైర్‌పర్సన్ సరిత హాజరయ్యారు. అమ్మవారి సన్నిధిలో లాంఛనంగా పాలకమండలి సభ్యులుగా ప్రమాణస్వీకారం చేశారు. అనంతరం అక్కడి నుంచి చైర్మన్ ఛాంబర్‌లోకి వచ్చి సభ్యులందరూ చైర్మన్‌ను ఎన్నుకునే ప్రక్రియ మొదలైంది. సభ్యురాలు నాగ శిరోమణి కొంకల నాగేశ్వరరెడ్డిని ప్రతిపాదించగా మరో సభ్యుడు జగదీశ్వర్‌గౌడు బలపరిచారు. దీంతో మిగతా సభ్యులందరూ ఆమోదించడంతో చైర్మన్ ఎన్నిక ఏకగ్రీవం అయ్యింది. పదవీకాలం ఉన్నంత వరకు అమ్మవారి సేవలో తరిస్తానని, ఆలయ అభివృ ద్ధికి పాటు పడతానని చైర్మన్ అన్నారు. అనంతరం సంపత్‌కుమార్ మాట్లడుతూ.. ఆలయంలో పెండింగ్ పనులన్నీ పూర్తి చేస్తామని, పురావస్తుశాఖతో ఉన్న సమస్యలను పరిష్కరిస్తామని తెలిపారు. అనంతరం ఆలయం నుంచి సభాస్థలి వరకు భారీ ర్యాలీ నిర్వహించా రు. సంపత్‌కుమార్ మాట్లాడు తూ.. పదవులు రానివారు ఎవ రూ అధైర్య పడొద్దని, పార్టీ కోస ం కష్టపడ్డవారందరికీ పదవులు వస్తాయని అన్నారు. గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి హాజరై చైర్మన్, సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు.
దేవాలయాల అభివృద్ధికి నిధులివ్వాలి : ఎంపీ డీకే అరుణ
మహబుబ్‌నగర్ ఎంపీ డీకే అరుణ శుక్రవారం నవరాత్రుల సందర్భంగా ముఖ్యనాయకులతో కలిసి అలంపూర్ ఆలయాలను దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు, హోమాలు నిర్వహించారు. అనంతరం నూతన చైర్మన్‌కు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లడుతూ.. ఆలయాల అభివృద్ధికి ఇప్పటికే ప్రసాద్ స్కీం ద్వారా కేంద్రం ఇచ్చిన నిధులు పనులు పూర్తయ్యాయని, రాష్ట్ర ప్ర భుత్వం కూడా ఆలయానికి నిధులివ్వాలని కోరారు. జోగుళాంబ రైల్వేహాల్ట్‌ను భవిష్యత్‌లో పెద్దస్టేషన్‌గా మార్చుతామని అన్నారు.