Share News

అమరుల స్ఫూర్తితో శాంతిభద్రతల పరిరక్షణ

ABN , Publish Date - Oct 22 , 2024 | 12:23 AM

The maintenance of law and order in the spirit of the immortals అమరుల స్ఫూర్తితో శాంతిభద్రతల పరిరక్షణకు మరింత చిత్తశుద్ధితో కృషి చేయాలని కలెక్టర్‌ బదావత్‌ సంతోష్‌, ఎస్పీ గైక్వాడ్‌ వైభవ్‌ రఘు నాథ్‌ సిబ్బందికి పిలుపునిచ్చారు. పోలీసుల సంక్షే మానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తా మని వారు భరోసానిచ్చారు.

అమరుల స్ఫూర్తితో శాంతిభద్రతల పరిరక్షణ
అమరవీరుల స్తూపానికి నివాళి అర్పిస్తున్న కలెక్టర్‌ బదావత్‌ సంతోష్‌, అధికారులు

- పోలీస్‌ అమరవీరుల సంస్మరణ దినోత్సవంలో కలెక్టర్‌, ఎస్పీ వెల్లడి

- జిల్లా కేంద్రంలో భారీ ర్యాలీ

- అమరుల స్తూపానికి ఘన నివాళి

నాగర్‌కర్నూల్‌, అక్టోబరు 21 (ఆంధ్రజ్యోతి) : అమరుల స్ఫూర్తితో శాంతిభద్రతల పరిరక్షణకు మరింత చిత్తశుద్ధితో కృషి చేయాలని కలెక్టర్‌ బదావత్‌ సంతోష్‌, ఎస్పీ గైక్వాడ్‌ వైభవ్‌ రఘు నాథ్‌ సిబ్బందికి పిలుపునిచ్చారు. పోలీసుల సంక్షే మానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తా మని వారు భరోసానిచ్చారు. పోలీస్‌ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సోమవారం పోలీస్‌ పరేడ్‌ గ్రౌండ్‌లో నిర్వహించారు. అమరవీరుల స్తూపా నికి కలెక్టర్‌, ఎస్పీలతోపాటు జిల్లాలోని డీఎస్పీలు, సీఐలు, ఎస్‌ఐలు, పోలీస్‌ అమరుల కుటుంబాలు నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సంస్మరణ సభలో కలెక్టర్‌ మాట్లాడుతూ.. పోలీసుల త్యాగాలు వెలకట్టలేనివన్నారు. సంఘ విద్రోహ శక్తులతో పోరాడి అసువులు బాసిన వారి కుటుంబాలను అన్ని విధాలుగా ఆదుకుం టామన్నారు. ఎస్పీ మాట్లాడుతూ.. పోలీసులు ఎంత అంకిత భావంతో పని చేసినా.. ప్రజలు పూర్తిగా సహకరిస్తేనే సంఘజీవనం ప్రశాంత ంగా ఉంటుందన్నారు. పోలీస్‌ వ్యవస్థను ప్రజల కు చేరువ చేసేందుకు అనేక సంస్కర ణలను తీసుకొచ్చామన్నారు. ఈ సందర్భంగా పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో అడి షనల్‌ ఎస్పీ రామేశ్వర్‌, డీఎస్పీలు శ్రీనివాస్‌ యాదవ్‌, కర్నె శ్రీనివాస్‌, సీఐలు కనకయ్యగౌడ్‌, పల్లె రవీందర్‌, విష్ణువర్ధన్‌రెడ్డి, శంకర్‌, నాగార్జున, మహేష్‌, ఎస్‌ఐలు పాల్గొన్నారు.

త్యాగాలు స్మరించుకోవాలి

అచ్చంపేటటౌన్‌: విధి నిర్వహణలో అసువులు బాసిన పోలీసుల త్యాగాలను స్మరించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉందని సీఐ రవీందర్‌ అన్నారు. పోలీస్‌ అమరవీరుల దినోత్సవం సందర్భంగా సోమవారం పట్టణంలోని పోలీస్‌ స్టేషన్‌లో పోలీస్‌ శాఖ, లయన్స్‌ క్లబ్‌ ఆధ్వర్వంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు.

కొల్లాపూర్‌: విధి నిర్వహణలో ప్రాణాలర్పించిన పోలీస్‌ అమరవీరుల త్యాగాలు ఎప్పటికీ మరువ లేమని ఎస్‌ఐ రుషికేష్‌ పేర్కొన్నారు. సోమవారం ఎస్పీ పరదే శినాయుడు, ఎస్పీ ఉమేశ్‌చంద్ర చిత్ర పటాలకు పూల మాలలు వేసి నివాలుల ర్పించారు.

పెద్దకొత్తపల్లి: విధి నిర్వహణలో అసువులు బాసిన పోలీస్‌ అమరవీరుల త్యాగాలు మరు వలేనివని ఎస్‌ఐ సతీష్‌ అన్నారు. పోలీస్‌ అమర వీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా పోలీస్‌ స్టేషన్‌లో అమరులైన పోలీసుల చిత్రపటాలకు పూల మాలలు వేసి ఘన నివాళులర్పించారు.

Updated Date - Oct 22 , 2024 | 12:23 AM