Share News

AIIMS recruitment: మంగళగిరి ఎయిమ్స్‌కు 534 పోస్టులు

ABN , Publish Date - Apr 18 , 2025 | 03:53 AM

మంగళగిరి ఎయిమ్స్‌లో 534 ప్రధాన ఉద్యోగాలను శాశ్వతంగా భర్తీ చేయాలని కేంద్రం ఆమోదించింది. మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్‌ కృషికి ఫలితంగా ఈ ఉద్యోగాల మంజూరుకు మార్గం సుగమమైంది.

AIIMS recruitment: మంగళగిరి ఎయిమ్స్‌కు 534 పోస్టులు

భర్తీకి కేంద్ర ఆర్థిక శాఖ ఆదేశం.. ఫలించిన మంత్రి పెమ్మసాని కృషి

మంగళగిరి సిటీ, ఏప్రిల్‌ 17 (ఆంధ్రజ్యోతి): గుంటూరు జిల్లా మంగళగిరి ఎయిమ్స్‌ ఆస్పత్రి అభివృద్ధి కోసం కేంద్ర గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్స్‌ శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్‌ చేస్తున్న కృషి ఫలిస్తోంది. ఈ క్రమంలో 960 పడకల మంగళగిరి ఎయిమ్స్‌ ఆస్పత్రిలో 534 ప్రధాన ఉద్యోగాలను శాశ్వత ప్రాతిపదికన భర్తీ చేయాలని కేంద్ర ఆర్థిక శాఖ గురువారం ఆదేశాలు జారీచేసింది. దీనికి ‘ప్రధాన మంత్రి స్వస్త్య సురక్ష యోజన’ కింద ఆయా పోస్టుల మంజూరుకు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కూడా ఆమోదం తెలిపింది. ఈ ఏడాది ఫిబ్రవరి 28న ఎయిమ్స్‌ ఆస్పత్రిని సందర్శించిన పెమ్మసాని.. ఆస్పత్రి సమస్యలు, రోగులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను తెలుసుకున్నారు. ఈ నెల 2న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ను కలిసి వాటిని ఆమె దృష్టికి తీసుకెళ్లారు.


ఈ క్రమంలోనే ఎయిమ్స్‌ ఆస్పత్రి సామర్థ్యానికి సరిపడా 534 ఉద్యోగాలను మంజూరు చేస్తూ ఆదేశాలు వెలువడ్డాయి. ఈ పోస్టుల్లో 10 అసోసియేట్‌ ప్రొఫెసర్‌, 40 అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌, 100 సీనియర్‌ రెసిడెంట్లు, మరో వంద జూనియర్‌ రెసిడెంట్లు, 3 డిప్యూటీ నర్సింగ్‌ సూపరింటెండెంట్‌, 10 అసిస్టెంట్‌ నర్సింగ్‌ సూపరింటెండెంట్‌ పోస్టులు, వంద నర్సింగ్‌ ఆఫీసర్స్‌ పోస్టులు ఉన్నాయి. దీనిపై మంత్రి పెమ్మసాని మాట్లాడుతూ.. వైద్యులు, సిబ్బంది పోస్టుల భర్తీకి సహకరించిన చంద్రబాబు, కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్‌, జేపీ నడ్డా తదితరులకు కృతజ్ఞతలు తెలిపారు.


ఈ వార్తలు కూడా చదవండి..

National Testing agency: జేఈఈ మెయిన్ సెషన్ - 2 ఫైనల్ కీ విడుదల

AP Ministers: దెయ్యాలు.. వేదాలు వల్లించినట్లు..

AP High Court: బోరుగడ్డ అనిల్‌కు గట్టి షాక్

Rain Alert: తెలంగాణలో కాసేపట్లో వర్షం.. ఉరుములతో కూడిన వానలు.. ఏ జిల్లాల్లో అంటే..

Gold: పోలీసుల తనిఖీలు.. 18 కేజీల బంగారం పట్టివేత

Waqf Bill: వక్ఫ్ సవరణ చట్టంపై వాదనలు.. సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు

K Ram Mohan Naidu: కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుని అభినందించిన సీఎం చంద్రబాబు

తండ్రికి తలకొరివి పెట్టిన కూతురు

AP Govt: ఎస్సీ వర్గీకరణ ఆర్డినెన్స్ జారీ చేసిన ఏపీ ప్రభుత్వం

For AndhraPradesh News And Telugu News

Updated Date - Apr 18 , 2025 | 03:53 AM