Home » Andhra Pradesh
Andhrapradesh: అమరావతిలో రూ.2700 కోట్ల విలువ కల రెండు ఇంజరీనింగ్ పనులకు కేబినెట్ ఆమోదం తెలుపనుంది. తిరుపతిలో ఈఎస్ఐ ఆసుపత్రిని 50 పడకల నుంచి 100 పడకలకు అప్ గ్రేడ్ చేసే ప్రతిపాదనకు కేబినెట్లో ఆమోదం లభించే అవకాశం ఉంది. ఏపీ ఎంఆర్యూడీఏ చట్టం 2016లో భవనాల లే అవుట్ల అనుమతులను మున్సిపాలిటీలకు అప్పగిస్తూ సవరణ ప్రతిపాదనకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం ఉంది.
Andhrapradesh: దట్టమైన పొగమంచుతో గన్నవరం ఎయిర్పోర్టుకు వచ్చే పలు విమానాల రాకపోకలకు కూడా తీవ్ర అంతరాయం ఏర్పడింది. గన్నవరం ఎయిర్పోర్టు మొత్తాన్ని పొగ మంచు కమ్మేసింది. దీంతో విమానాల ల్యాండింగ్కు ఇబ్బందులు తలెత్తుతున్నాయి. విమానాశ్రయంలో ల్యాండ్ అవ్వాల్సిన ఇండిగో, ఎయిర్ ఇండియా విమానాలు మొత్తం గాల్లోనే చెక్కర్లు కొడుతున్నాయి.
జగన్ హయాంలో సకల శాఖా మంత్రిగా పేరొందిన సజ్జల రామకృష్ణారెడ్డి సోదరులు అటవీ భూమికి ఎసరు పెట్టారు.
రాష్ట్రాన్ని జగన్ తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలోకి నెట్టి వెళ్లిపోయారని.. పళ్ల బిగువున ఆ సమస్యలను భరిస్తూ ముందుకు వెళ్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు.
సినిమా రంగంలో భవిష్యత్తులో అమరావతి కూడా ప్రభావం చూపే ప్రాంతం అవుతుందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు.
బ్యాంకు మేనేజరు నుంచి లేడీ రౌడీ షీటరుగా మారిన ఓ మాజీ ఉద్యోగిని కథ ఇది..
రాష్ట్రంలోని మద్యం ప్రియులు రెచ్చిపోయారు. 31వ తేదీ ఒక్కరోజే దాదాపు రూ.200 కోట్ల మద్యం తాగేశారు. నూతన సంవత్సరం సందర్భంగా సుమారు 2.5లక్షల కేసుల లిక్కర్, 70వేల కేసుల బీరును మందుబాబులు కొనుగోలు చేశారు.
గత శతాబ్ద కాలంలో దేశవ్యాప్తంగా 2024 అత్యంత వేడి సంవత్సరంగా రికార్డు సృష్టించింది. భారత వాతావరణ శాఖ వివరాల ప్రకారం 1901 నుంచి 2020 వరకూ నమోదైన వార్షిక సగటు కంటే గడచిన ఏడాది గరిష్ఠ ఉష్ణోగ్రత 0.65 డిగ్రీలు అధికంగా నమోదైంది.
హైదరాబాద్లోని బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆస్పత్రిని త్వరలో విస్తరిస్తామని, అలాగే ఏపీలోని తుళ్లూరు ప్రాంతంలోనూ ఆస్పత్రి నిర్మాణాన్ని చేపడతామని ఆస్పత్రి చైర్మన్, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ప్రకటించారు.
నూతన సంవత్సరం తొలిరోజున బుధవారం సీఎం చంద్రబాబు పేదలకు ప్రయోజం కలిగించే సీఎం సహాయ నిధి(సీఎంఆర్ఎఫ్) ఫైలుపై సంతకం చేశా రు. ఒకేసారి 1600 మందికి రూ.24.16 కోట్ల నిధులు విడుదల కానున్నాయి.