agriculture: ఆధునిక పద్ధతులతో అధిక దిగుబడులు
ABN , Publish Date - Mar 12 , 2025 | 12:07 AM
రైతులు అధునిక వ్యవసాయ పద్ద్ధతులు, యంత్రా లు ఉపయోగిస్తే అధిక దిగుబడులు సాధించవచ్చునని ఆచార్య ఎనజీ రంగా వ్యవసాయ ఇంజనీరింగ్ కళాశాల అసోసియేట్ డీన సరోజినీ దేవి పేర్కొన్నారు. ఎస్సీ రైతులకు మంగళవారం ఆధునిక యంత్రాల వాడకంపై ఒక్క రోజు శిక్షణా తరగతులు కళాశాలో నిర్వహించారు.

మడకశిర రూరల్, మార్చి 11 (ఆంధ్రజ్యోతి): రైతులు అధునిక వ్యవసాయ పద్ద్ధతులు, యంత్రా లు ఉపయోగిస్తే అధిక దిగుబడులు సాధించవచ్చునని ఆచార్య ఎనజీ రంగా వ్యవసాయ ఇంజనీరింగ్ కళాశాల అసోసియేట్ డీన సరోజినీ దేవి పేర్కొన్నారు. ఎస్సీ రైతులకు మంగళవారం ఆధునిక యంత్రాల వాడకంపై ఒక్క రోజు శిక్షణా తరగతులు కళాశాలో నిర్వహించారు. ఈ శిక్షణను వ్యవసా య ఇంజనీరింగ్ కళాశాల ఆధ్వర్యంలో, ఎస్సీ ఉప ప్రణాళిక కింద భారత వ్యవసాయ పరిశోధనా మండలి, న్యూఢిల్లీ వారి సౌజన్యంతో నిర్వహించారు. మండలంలోని హరేసముద్రం, ఆర్ అనంతపురం, గౌడనహళ్ళి, చీపులేటి, రేకలకుంట గ్రామాలకు చెందిన 30 మంది ఎస్సీ రైతులకు శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా అసోసియేట్ డీన మాట్లాడుతూ మారుతున్న కాలానికి అనుగుణంగా రైతులు తక్కువ పెట్టుబడులతో అధిక దిగుబడులు సాధించేలా ఆలోచించాలన్నారు. రై తులకు కళాశాలో ఉన్న అధునిక యంత్రాలపై అవగాహన కల్పించారు. అనంతరం బ్యాటరీలు, స్ర్పేయర్లు ఉచితంగా పంపిణీ చేశారు. అఽధ్యాపకులు కిషోర్, హరిబాబు, ఏఓ తిమ్మప్ప పాల్గొన్నారు.