AP SSC results 2025: టెన్త్‌లో 81.14 శాతం ఉత్తీర్ణత
ABN , Publish Date - Apr 24 , 2025 | 04:21 AM
ఆంధ్రప్రదేశ్ పదో తరగతి ఫలితాల్లో 81.14% ఉత్తీర్ణత నమోదు కాగా, కాకినాడకు చెందిన నేహాంజని 600కి 600 మార్కులు సాధించి రాష్ట్ర టాపర్‌గా నిలిచింది. బాలికలు బాలురకంటే మెరుగైన ఫలితాలు సాధించగా, బీసీ గురుకులాలు 95% ఉత్తీర్ణతతో ఆకట్టుకున్నాయి.
కాకినాడ విద్యార్థిని నేహాంజనికి 600 మార్కులు
రాష్ట్రంలో ఆరుగురికి 599 మార్కులు
బాలికలు 84.09ు, బాలురు 78.31ు పాస్
1,680 పాఠశాలల్లో వంద శాతం ఉత్తీర్ణత
19 పాఠశాలల్లో ఒక్కరూ పాస్ కాలేదు
పార్వతీపురం మన్యం జిల్లా హ్యాట్రిక్
వరుసగా మూడోసారి టాప్‌లో ‘మన్యం’
అట్టడుగున అల్లూరి సీతారామరాజు జిల్లా
గురుకుల పాఠశాలల్లో 95.02ు ఉత్తీర్ణత
మే 19 నుంచి సప్లిమెంటరీ పరీక్షలు
అమరావతి, ఏప్రిల్ 23(ఆంధ్రజ్యోతి): పదో తరగతి పబ్లిక్ పరీక్షల్లో 81.14 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. టెన్త్ పరీక్షల ఫలితాలను మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి లోకేశ్ బుధవా రం ‘ఎక్స్’ ద్వారా విడుదల చేశారు. రాష్ట్రంలోని 11,819 పాఠశాలల నుంచి మొత్తం 6,14,459 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కాగా 4,98,585 మంది పాస్ అయ్యారు. బాలికలు 3,01,202 మంది పరీక్షలు రాస్తే 2,53,278 (84.09%) మంది ఉత్తీర్ణత సాధించారు. బాలురు 3,13,257 మందికి గాను 2,45,307 (78.31%) మంది పాస్ అయ్యారు. 2024తో పోలిస్తే ఉత్తీర్ణత 5.55 శాతం తగ్గింది. రాష్ట్రవ్యాప్తంగా 1,680 బడులు వంద శాతం ఉత్తీర్ణత సాధించాయి. 19 పాఠశాలల్లో ఒక్కరు కూడా పాస్ కాలేదు. ఉత్తీర్ణతలో 93.9 శాతంతో పార్వతీపురం మన్యం జిల్లా వరుసగా మూడోసారి అగ్రస్థానంలో నిలిచింది. అల్లూరి సీతారామరాజు జిల్లా 47.64 శాతంతో అట్టడుగున ఉంది. ఏపీ గురుకుల పాఠశాలలు అత్యధికంగా 95.02% ఉత్తీర్ణత సాధించాయి.
హిందీలో 99.51% పాస్
సబ్జెక్టుల వారీగా... హిందీలో అత్యధికంగా 99.51 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. ఇంగ్లి్‌షలో 96.1ు మంది, ప్రథమ భాషలో 95.94ు, సోషల్ స్టడీ్‌సలో 92.9ు, సైన్స్‌లో 90.17ు, గణితంలో అతి తక్కువగా 86.92ు మంది పాసయ్యారు.
మేనేజ్‌మెంట్ల వారీగా... ఏపీ గురుకులాలు, బీసీ సంక్షేమ పాఠశాలల్లో అత్యధికంగా 95ు మంది పాసయ్యారు. ప్రైవేటు పాఠశాలల్లో 94.4ు, సోషల్ వెల్ఫేర్ పాఠశాలల్లో 89.5శాతం, మోడల్ స్కూళ్లలో 84ు, కేజీబీవీల్లో 83ు మంది ఉత్తీర్ణత సాధించారు. ఆశ్రమ్ పాఠశాలల్లో 61.6%, ప్రభుత్వ మేనేజ్‌మెంట్ పాఠశాలల్లో 62.7ు మంది పాసయ్యారు.
నేహాంజనికి 600కి 600 మార్కులు
కాకినాడకు చెందిన యాళ్ల నేహాంజని 600 మార్కులు సాధించి రాష్ట్రంలోనే టాపర్‌గా నిలిచింది. రాష్ట్రవ్యాప్తంగా మరో ఆరుగురికి 599 మార్కులు, 14మందికి 598 మార్కులు వచ్చాయి. పల్నాడు జిల్లాలోని జడ్పీ పాఠశాలలో చదివిన ఎ. పావని చంద్రిక 598 మార్కులు సాధించింది.
ఓపెన్ స్కూల్‌లో 37.93 ఉత్తీర్ణత
రెగ్యులర్ ఫలితాలతో పాటు ఓపెన్ స్కూల్ సొసైటీ నిర్వహించి టెన్త్, ఇంటర్మీడియట్ ఫలితాలను మంత్రి లోకేశ్ విడుదల చేశారు. టెన్త్ పరీక్షలు 26,679 మంది రాయగా వారిలో 10,119 (37.93ు) ఉత్తీర్ణులయ్యారు. ఇంటర్మీడియట్ పరీక్షలు 63,668 మంది రాయగా వారిలో 33,819 (53.1ు) మంది ఉత్తీర్ణత సాధించారు.
బీసీ గురుకులాల్లో టెన్త్ ఫలితాలు భేష్: మంత్రి సవిత
టెన్త్‌లో మహాత్మా జ్యోతిబా పూలే బీసీ గురుకుల విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించారని మంత్రి ఎస్.సవిత హర్షం వ్యక్తం చేశారు. శ్రీసత్యసాయి జిల్లా పెనుకొండలోని టీడీపీ కార్యాలయంలో బుధవారం ఆమె మాట్లాడుతూ రాష్ట్ర ఉత్తీర్ణత శాతం కంటే బీసీ గురుకుల విద్యార్థుల ఉత్తీర్ణత శాతం అధికంగా ఉందని ఆనందం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో 81.14 శాతం ఉత్తీర్ణత నమోదవగా, బీసీ సంక్షేమశాఖ గురుకులాలు 95 శాతం ఉత్తీర్ణతతో సత్తా చాటాయన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 102 బీసీ గురుకుల పాఠశాలలకు చెందిన 5788 మంది విద్యార్థులు టెన్త్ పరీక్షలకు హాజరయ్యారని, 29 పాఠశాలలు వందశాతం ఉత్తీర్ణత సాధించాయని తెలిపారు. కార్పొరేట్ స్కూళ్లకు ధీటుగా బీసీ గురుకుల పాఠశాలలు ఫలితాలు సాధించాయన్నారు.
ఎస్సీ గురుకులాల్లో 90 శాతం ఉత్తీరత: మంత్రి డోలా
పదోతరగతి పరీక్ష ఫలితాల్లో ఎస్సీ గురుకులాలు, హాస్టళ్ల విద్యార్థులు 90 శాతం ఉత్తీర్ణత సాధించినట్టు రాష్ట్ర సాంఘిక సంక్షేమశాఖ మంత్రి డోలా బాలవీరాంజనేయస్వామి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. 593 మార్కులు సాధించిన పెదపావని గురుకుల విద్యార్థిని కవితను మంత్రి అభినందించారు. రాష్ట్రంలోని అన్ని ఎస్సీ గురుకులాల్లో 57 మంది 575కి పైగా మార్కులు సాధించారని తెలిపారు. గత మూడేళ్ల కంటే ఈ ఏడాది మెరుగైన ఫలితాలు వచ్చాయని పేర్కొన్నారు. మంత్రి లోకేశ్ విద్యాశాఖలో విప్లవాత్మకమైన మార్పులకు శ్రీకారం చుట్టారని, పేదింటి బిడ్డలు ఉన్నత చదువులు చదివి సమాజంలో గొప్ప స్థాయికి ఎదగాలన్నదే సీఎం చంద్రబాబు లక్ష్యమని మంత్రి తెలిపారు.
19 నుంచి సప్లిమెంటరీ పరీక్షలు
టెన్త్ విద్యార్థులకు మే 19 నుంచి 28 వరకు సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నారు. అపరాధ రుసుము లేకుండా ఈ నెల 24 నుంచి 30 వరకు విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. రీకౌంటింగ్, రీవెరిఫికేషన్‌కు ఈ నెల 24 నుంచి మే 1 వరకు పాఠశాల విద్యాశాఖ వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ఒక్కో సబ్జెక్టుకు రీకౌంటింగ్‌కు రూ.500, రీవెరిఫికేషన్‌కు రూ.వెయ్యి చొప్పున చెల్లించాలి.
నా శ్రమకు ఫలితం దక్కింది
‘రోజూ తెల్లవారుజామున 4.30గంటలకు నిద్రలేవడం, 2గంటలపాటు చదవడం, 7గంటలకు స్కూల్‌కు వెళ్లి రాత్రి 7గంటలకు ఇంటికి రావడం, డిన్నర్ అనంతరం మళ్లీ చదువుకోవడం ఇదీ నా దినచర్య. రోజుకు దాదాపు 17గంటలు పుస్తకాలతోనే కుస్తీ. బడిలో టీచర్లు చెప్పే పాఠాలు శ్రద్ధగా వినడం, సందేహాలను నివృత్తి చేసుకోవడం, ప్రణాళికాబద్ధంగా ఏకాగ్రతతో చదవడం, వాటిని గుర్తుపెట్టుకుని రాయడం వల్లే ఈ విజయం సాధ్యమైంది. ఉపాధ్యాయుల ప్రోత్సాహం, రివిజన్, ఎప్పుడైనా పరీక్షల్లో తప్పులు దొర్లితే అవి పునరావృతం కాకుండా జాగ్రత్తపడటం కూడా నూరు శాతం మార్కులు రావడానికి దోహదం చేశాయి. నా శ్రమకు ఫలితం దక్కింది. నేను సెల్‌ఫోన్ వాడటం చాలా అరుదు. టీవీ చూడటం కూడా అంతంతమాత్రమే. స్కూల్లో తోటి విద్యార్థులు, టీచర్లు అందరూ 598 మార్కులు వస్తే చాలనుకున్నారు. కానీ నేను మాత్రం 600 పైనే గురిపెట్టాను. పరీక్షలు రాసి వచ్చాక.. ప్రతిరోజూ ప్రశ్నపత్రం ‘కీ’ని పరిశీలించేదాన్ని. అప్పుడే నూరు శాతం మార్కులు వస్తాయని ఊహించాను. ముంబై ఐఐటీలో చేరి, ఆ తర్వాత ఐఏఎస్ సాధించడమే నా లక్ష్యం.’ - నేహాంజని, టెన్త్ స్టేట్ టాపర్, కాకినాడ
Also Read:
ఇలా నడిస్తే బోలెడు ప్రయోజనాలు..
లామినేషన్ మిషన్‌ను ఇలా వాడేశాడేంటీ...
ప్రధాని నివాసంలో కీలక సమావేశం..
For More Andhra Pradesh News and Telugu News..