Share News

Nayee Brahmins Salary: నాయీబ్రాహ్మణుల కనీస వేతనం 25 వేలకు పెంపు

ABN , Publish Date - Apr 25 , 2025 | 04:03 AM

ఆంధ్రప్రదేశ్‌లోని 44 ఆలయాల్లో తలనీలాలకు సేవలు అందించే నాయీబ్రాహ్మణులకు కనీస వేతనం రూ.25 వేలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దేవదాయ శాఖపై ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను పూర్తిగా అమలు చేసినట్టు ప్రభుత్వం ప్రకటించింది.

Nayee Brahmins Salary: నాయీబ్రాహ్మణుల కనీస వేతనం 25 వేలకు పెంపు

కొత్తగా 89,788 మందికి వితంతు పింఛన్లు

44 ఆలయాల్లో తలనీలాల విధులు నిర్వహించే వారికి అమలు

అమరావతి, ఏప్రిల్‌ 24(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని ఆలయాల్లో తలనీలాలకు సంబంధించిన విధులు నిర్వహించే నాయీబ్రాహ్మణులకు కనీస వేతనం కింద రూ.25 వేలు ఇచ్చేందుకు ప్రభుత్వం ఆంగీకరించింది. ఈ మేరకు దేవదాయ శాఖ ఇన్‌చార్జి కార్యదర్శి జి.జయలక్ష్మి గురువారం ఉత్తర్వులు జారీచేశారు. రాష్ట్రంలో ‘6ఏ’ కింద దాదాపు 175 ఆలయాలున్నాయి. అందులో 44 ఆలయాల్లో మాత్రమే భక్తులు నిత్యం తలనీలాలు సమర్పిస్తుంటారు. ఈ ఆలయాల్లో విధులు నిర్వహించే నాయీ బ్రాహ్మణులకు రూ.25 వేల కనీస వేతనాన్ని అమలు చేయనున్నారు. దీంతో ఎన్నికలముందు దేవదాయ శాఖపై ఇచ్చిన హామీలను ప్రభుత్వం వంద శాతం పూర్తి చేసింది.


Also Read:

ఇలా నడిస్తే బోలెడు ప్రయోజనాలు..

లామినేషన్ మిషన్‌ను ఇలా వాడేశాడేంటీ...

ప్రధాని నివాసంలో కీలక సమావేశం..

For More Andhra Pradesh News and Telugu News..

Updated Date - Apr 25 , 2025 | 04:03 AM