AP High Court: సిట్ అదుపులో రాజ్ కసిరెడ్డి సహాయకుడి తండ్రి!
ABN , Publish Date - Apr 18 , 2025 | 04:34 AM
తిరుపతికి చెందిన విశ్రాంత హెడ్ కానిస్టేబుల్ టి. బాలసుబ్రహ్మణ్యంరెడ్డిపై అక్రమ నిర్బంధం ఆరోపణలపై విచారణకు హైకోర్టు సోమవారం (21న) విచారణకు హాజరుకావాలని ఆదేశించింది. పిటిషనర్ తరపున వేయబడిన ఫొటోలు, ఇతర వివరాలపై సిట్ అధికారులకు సమర్పించమని కోర్టు సూచించింది.
హైకోర్టులో హెబియస్ కార్పస్ వ్యాజ్యం
అక్రమ నిర్బంధంపై నిగ్గుతేల్చేందుకు 21న మా ముందు హాజరవ్వండి
బాలసుబ్రహ్మణ్యంరెడ్డికి హైకోర్టు ఆదేశం
ఆయన్ను నిర్బంధించినవారి పేర్లు,వివరాలివ్వాలని సిట్‌కూ నిర్దేశం
అమరావతి/తిరుపతి, ఏప్రిల్ 17 (ఆంధ్రజ్యోతి): అక్రమ నిర్బంధం ఆరోపణలపై వాస్తవాలు తేల్చేందుకు సోమవారం తమ ముందు హాజరుకావాలని తిరుపతికి చెందిన విశ్రాంత హెడ్‌కానిస్టేబుల్ టి.బాలసుబ్రహ్మణ్యంరెడ్డిని గురువారం హైకోర్టు ఆదేశించింది. న్యాయస్థానం ముందు హాజరయ్యేందుకు వీలుగా ఈ నెల 20, 21 తేదీల్లో ఏ అథారిటీ/దర్యాప్తు అధికారి ముందూ హాజరు కావలసిన అవసరం లేదని ఆయనకు స్పష్టం చేసింది. ఈ మేరకు జస్టిస్ ఆర్.రఘునందనరావుతో కూడిన ద్విసభ్య ధర్మాసనం గురువారం ఉత్తర్వులు ఇచ్చింది. బాలసుబ్రహ్మణ్యంరెడ్డి.. పరారీలో ఉన్న రాజ్ కసిరెడ్డి సహాయకుడు ఈశ్వర్ కిరణ్‌కుమార్‌రెడ్డి తండ్రి. మూడేళ్లు రాజ్ వద్ద పనిచేసిన కిరణ్‌రెడ్డిని మద్యం స్కాంలో గతంలో సిట్ విచారించింది. తమ ముందుకు రాకుండా ఫోన్లు స్విచాఫ్ చేసుకుని పరారీలో ఉన్న రాజ్ కోసం విస్తృతంగా గాలిస్తోంది. హైదరాబాద్‌లో సోమవారం సోదాలు కూడా చేపట్టింది. ఈ క్రమంలో మళ్లీ కిరణ్‌రెడ్డిని ప్రశ్నించాలని అధికారులు భావించారు. బుధవారం అర్ధరాత్రి తిరుపతిలో వారి నివాసానికి చేరుకున్నారు. కిరణ్ అందుబాటులో లేకపోవడంతో తండ్రి బాలసుబ్రహ్మణ్యంరెడ్డిని అదుపులోకి తీసుకుని విజయవాడకు తరలించినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో బాలసుబ్రహ్మణ్యంరెడ్డి అల్లుడు, వైసీపీ నేత మేకా వెంకట్రామరెడ్డి హైకోర్టులో గురువారం అత్యవసరంగా హెబియస్ కార్పస్ పిటిషన్ వేశారు. బుధవారం అర్ధరాత్రి 11.50 గంటలకు తిరుపతిలోని ఇంటి నుంచి గుర్తు తెలియని కొందరు వ్యక్తులు బాలసుబ్రహ్మణ్యంరెడ్డిని తీసుకెళ్లారని, ఆయన ఆచూకీ తెలుసుకుని కోర్టు ముందు హాజరుపరచాల్సిందిగా పోలీసులను ఆదేశించాలని కోరారు. ధర్మాసనం లంచ్ మోషన్ పిటిషన్‌గా విచారణకు స్వీకరించింది. వెంకట్రామరెడ్డి తరఫున సీనియర్ న్యాయవాది ఎస్.శ్రీరామ్ వాదనలు వినిపించారు.
మఫ్టీలో వచ్చిన పోలీసులు సుబ్రహ్మణ్యంరెడ్డిని అక్రమంగా నిర్బంధించి విజయవాడకు తరలించారని.. రహస్య ప్రదేశంలో నిర్బంధించారని తెలిపారు. ఆయన్ను ఏ కేసులో అదుపులోకి తీసుకుంటున్నారో చెప్పలేదన్నారు. ఆయన కుమారుడి గురించి ఆరా తీశారని, అది తెలియకపోవడంతో ఆయన్ను తీసుకెళ్లారని తెలిపారు. ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది(ఎ్‌సజీపీ) విష్ణుతేజ వాదనలు వినిపిస్తూ.. ఓ కేసులో సాక్షిగా గురువారం తమ ముందు హాజరుకావాలని ఈ నెల 14న సిట్ అధికారులు సుబ్రహ్మణ్యంరెడ్డికి నోటీసులు ఇచ్చారన్నారు. ఫొటోలను పరిశీలిస్తే విజయవాడ వచ్చేందుకు ఆయన తన పూర్వ సహచరుల సహాయం తీసుకున్నట్లు కనపడుతోందని తెలిపారు. సుబ్రహ్మణ్యంరెడ్డి ప్రస్తుతం సిట్ ముందు ఉన్నారని, ఆయన వాంగ్మూలాన్ని పోలీసులు నమోదు చేస్తున్నారని వివరించారు. ఇరుపక్షాల వాదనలు పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం... అక్రమ నిర్బంధం ఆరోపణలపై వాస్తవాలు తేల్చేందుకు సోమవారం (21న) తమ ముందు హాజరుకావాలని బాలసుబ్రహ్మణ్యంరెడ్డిని ఆదేశించింది. పిటిషనర్ కోర్టు ముందుంచిన ఫొటోలలోని వ్యక్తులను గుర్తించి.. వారి పేర్లు, ఇతర వివరాలను తమకు సమర్పించాలని సిట్ అధికారులను కూడా ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 21కి వాయిదా వేసింది.
ఈ వార్తలు కూడా చదవండి..
National Testing agency: జేఈఈ మెయిన్ సెషన్ - 2 ఫైనల్ కీ విడుదల
AP Ministers: దెయ్యాలు.. వేదాలు వల్లించినట్లు..
AP High Court: బోరుగడ్డ అనిల్‌కు గట్టి షాక్
Rain Alert: తెలంగాణలో కాసేపట్లో వర్షం.. ఉరుములతో కూడిన వానలు.. ఏ జిల్లాల్లో అంటే..
Gold: పోలీసుల తనిఖీలు.. 18 కేజీల బంగారం పట్టివేత
Waqf Bill: వక్ఫ్ సవరణ చట్టంపై వాదనలు.. సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు
K Ram Mohan Naidu: కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుని అభినందించిన సీఎం చంద్రబాబు
తండ్రికి తలకొరివి పెట్టిన కూతురు
AP Govt: ఎస్సీ వర్గీకరణ ఆర్డినెన్స్ జారీ చేసిన ఏపీ ప్రభుత్వం
For AndhraPradesh News And Telugu News