APNGO: ఉద్యోగుల సమస్యలపై దృష్టి సారించండి
ABN , Publish Date - Apr 23 , 2025 | 05:01 AM
ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఏపీఎన్జీవో నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. డీఏ బకాయిల విడుదలతో పాటు పీఆర్సీ కమిషనర్ నియామకాన్ని కోరారు.
ప్రభుత్వాన్ని కోరిన ఏపీఎన్జీవో నేతలు
విజయవాడ గాంధీనగర్, ఏప్రిల్ 22(ఆంధ్రజ్యోతి): ఉద్యోగుల సమస్యల పరిష్కారంపై దృష్టి సారించాలని ఏపీఎన్జీవో అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు శివారెడ్డి, విద్యాసాగర్ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. పీఆర్సీ కమిషనర్‌ను తక్షణమే నియమించాలని, పెండింగ్‌లో ఉన్న డీఏలు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. సంఘం రాష్ట్ర కార్యవర్గ సమావేశం గాంధీనగర్‌లోని ఎన్జీవో హోంలో మంగళవారం జరిగింది. ఈ సందర్భంగా సంఘం నాయకులు శివారెడ్డి, విద్యాసాగర్ మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వ ఉద్యోగుల పని ఒత్తిడి తగ్గించేందుకు చర్యలు తీసుకోవాలని, గురుకుల పాఠశాల, ప్రైవేట్‌రంగ ఉద్యోగుల పదవీ విరమణ వయస్సు 62 ఏళ్లకు పెంచాలని కోరారు. ఉద్యోగులకు సంబంధించిన 14 డిమాండ్లతో వినతిపత్రాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చామన్నారు. ఈ డిమాండ్లపై ఈ నెల 19న సీఎ్‌సతో చర్చించామన్నారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించి రూ.6,300 కోట్ల బకాయిలు చెల్లించిందని చెప్పారు. ఇందుకు సీఎం చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపారు. కూటమి ప్రభుత్వంలో ఉద్యోగులు స్వేచ్ఛగా ఉన్నారని తెలిపారు. ఏపీ జేఏసీ ప్రభుత్వానికి ఇచ్చిన 14 డిమాండ్లను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర కార్యనిర్వహక కార్యదర్శి కె.జగదీశ్వరరావు, కోశాధికారి ఎ.రంగారావు, సహాధ్యక్షుడు వి.దస్తగిరిరెడ్డి, ఉపాధ్యక్షుడు డీవీ రమణ, వై.ప్రసాద్, పి.శ్రీనివాస్, జె.మాధవ్ తదితరులు పాల్గొన్నారు.
Also Read:
కసిరెడ్డి కేసులో బిగ్ ట్విస్ట్..
చంపింది మేమే.. TRF ఉగ్రవాద సంస్థ ప్రకటన
For More Andhra Pradesh News and Telugu News..