Vallabhaneni Vamsi: వంశీ బెయిల్ పిటిషన్‌పై ముగిసిన వాదనలు
ABN , Publish Date - Apr 22 , 2025 | 05:31 AM
సత్యవర్థన్ కిడ్నాప్ కేసులో మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌పై వాదనలు ముగిశాయి. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి తీర్పును ఏప్రిల్ 24వ తేదీకి వాయిదా వేశారు.
తీర్పు 24వ తేదీకి వాయిదా
విజయవాడ, ఏప్రిల్ 21 (ఆంధ్రజ్యోతి): సత్యవర్థన్ కిడ్నాప్ కేసులో విజయవాడ జిల్లా జైల్లో ఉన్న గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌పై వాదనలు సోమవారం ముగిశాయి. ఈ కేసులో వంశీ తొలిసారి వేసిన బెయిల్ పిటిషన్‌ను ఎస్సీ, ఎస్టీ కేసుల విచారణ న్యాయస్థానం కొట్టేసిన విషయం తెలిసిందే. దీంతో ఆయన రెండోసారి బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ప్రాసిక్యూషన్ తరఫున డిప్యూటీ డైరెక్టర్ రాజేంద్రప్రసాద్ వాదించారు. ఈ కేసులో దర్యాప్తు ఇంకా పూర్తికాలేదని, నిందితుడికి బెయిల్ ఇవ్వొద్దని కోర్టును అభ్యర్థించారు. వంశీ జైలు నుంచి బయటికి వస్తే బాధితుడు సత్యవర్థన్‌కు ప్రాణహాని ఉంటుందని ఆందోళన వ్యక్తం చేశారు. వంశీ తరఫున డాక్టర్ వి.దేవీసత్యశ్రీ వాదనలు వినిపిస్తూ.. బాధితుడు సత్యవర్థన్‌కు పోలీసులు అన్ని రకాల రక్షణ చర్యలు కల్పిస్తున్నారని, కనుక ఆయనకు ఎలాంటి ప్రాణహాని కలిగే అవకాశం లేదని విన్నవించారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల్లో 60 రోజుల్లో చార్జిషీటు దాఖలు చేయాల్సి ఉందని, కేసు నమోదు చేసి ఇప్పటికి 70 రోజులైందని వివరించారు. ఈ అంశాలను పరిగణనలోకి తీసుకుని వంశీకి బెయిల్ మంజూరు చేయాలని కోరారు. ఇరువర్గాల వాదనలను విన్న న్యాయాధికారి పి.భాస్కరరావు తీర్పును ఈ నెల 24వ తేదీకి వాయిదా చేశారు. కాగా, సత్యవర్థన్ కేసులో ఏ7గా ఉన్న వెలినేని శివరామకృష్ణ ప్రసాద్ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌పై తీర్పును అదేరోజు వెల్లడిస్తామని న్యాయాధికారి పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
Post Office: ఏమిటి.. ఇన్నీ మంచి పథకాలా..
10th Class Result: 10వ తరగతి పరీక్ష ఫలితాలు.. విడుదల ఎప్పుడంటే..
Business: ఈ పథకంలో జస్ట్ రూ. 45 పెట్టుబడిగా పెట్టండి.. రూ. 25 లక్షలు మీ సొంతం
Rs 500 Notes: రూ. 500 నోట్లపై కీలక అప్ డేట్: కేంద్రం వార్నింగ్
Pope Francis: పోప్ ఫ్రాన్సిస్ మృతి.. స్పందించిన ప్రధాని మోదీ
వాటికన్ సిటీలో పోప్ ఫ్రాన్సిస్ (21-04-2025) సోమవారం మృతి చెందారు.
RVNL: దేశంలోనే తొలిసారి... అతిపొడవైన 14.57 కి.మీ.సొరంగం పూర్తి
For More Andhra Pradesh News and Telugu News..