Share News

బీసీ జనగణన జరిపించాలి

ABN , Publish Date - Apr 17 , 2025 | 12:57 AM

ప్రభుత్వం బీసీ జనగణన తప్పనిసరిగా జరిపించాలని ఏపీ బీసీ ఫె డరేషన చైర్మన తమ్మిశెట్టి చక్రవర్తి తెలిపారు.

బీసీ జనగణన జరిపించాలి
వేదపండితుల ఆశీర్వాదం పొందుతున్న బీసీ ఫెడరేషన చైర్మన తమ్మిశెట్టి చక్రవర్తి

ఫ ప్రతి కార్పొరేషనకు

రూ.500 కోట్లు మంజూరు చేయాలి

ఫ ఏపీ బీసీ ఫెడరేషన చైర్మన

తమ్మిశెట్టి చక్రవర్తి

ఫ మహానందిలో ప్రత్యేక పూజలు

మహానంది, ఏప్రిల్‌ 16(ఆంధ్రజ్యోతి): ప్రభుత్వం బీసీ జనగణన తప్పనిసరిగా జరిపించాలని ఏపీ బీసీ ఫె డరేషన చైర్మన తమ్మిశెట్టి చక్రవర్తి తెలిపారు. బుధ వారం మహానంది రక్షేత్రంలో ఆయన ప్రత్యేక పూజలు జరిపారు. అనంతరం ఆయన విలేకరులతో మా ట్లాడారు. ప్రభుత్వం అన్ని కులాల కార్పొరేషన్లకు చైర్మన్లను నియ మించి, ప్రతి కార్పొరేషనకు రూ.500 కోట్లు నిధులు మంజూరు చేసి బీసీల అభివృద్ధికి పాటుప డాలని అన్నారు. ఆలయాల పాలక మండలిలో వడ్డే, విశ్వబ్రాహ్మణ, నాయీబ్రాహ్మణ, గంగపుత్రులకు స్ధానం కల్పించాలని తెలిపారు. విధ్యార్దులకు ఫీజు రీఎంబర్స్‌మెంట్‌తో స్కాలర్‌షిప్‌ విద్యార్ధుల అకౌంట్‌లో జమ చేయాలని డిమాండ్‌ చేశారు. విద్యార్థులకు హాల్‌ టికెట్లు ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేస్తున్న కళాశాల యాజమాన్యాలపై కఠిన చర్యలు తీసుకోవా లన్నారు. ఉమ్మడి కర్నూలు జిల్లా బీసీ సమాఖ్య అధ్యక్షుడు మల్లేశ్వరుడు, వడ్డెర సంఘం నంద్యాల జిల్లా అధ్యక్షుడు చక్రధర్‌ పాల్గొన్నారు.

Updated Date - Apr 17 , 2025 | 12:57 AM