Home » Telugu News
మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టును అడ్డుకోవాలని చూసేవారు కుక్కచావు చస్తారని సీఎం రేవంత్‌రెడ్డి హెచ్చరించారు. బుల్డోజర్లు ఎక్కించి అయినా ప్రాజెక్టును చేపట్టి తీరతామని ప్రకటించారు.
దేశానికి తెలంగాణ మోడల్‌గా కుల గణన నడుస్తుందని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క వ్యాఖ్యానించారు. మహిళ సంఘాలకు వడ్డీ లేని రుణాలు అందిస్తూ.. ఆ వడ్డీనీ సైతం ప్రభుత్వం కట్టనుందని స్పష్టం చేశారు. మహిళ సంఘాలతో వెయ్యికి మెగా ఓల్ట్ విద్యుత్ ఉత్పత్తికి ఒప్పందం చేసుకున్నామని పేర్కొన్నారు.
మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు తెలంగాణలో తీవ్ర దుమారాన్ని రేపాయి. కేటీఆర్‌పై ఆరోపణలు చేస్తూ అక్కినేని ఫ్యామిలీని కూడా మంత్రి కొండా సురేఖ ప్రస్తావనకు తీసుకువచ్చారు. హీరోయిన్ల జీవితాలతో ఆడుకోవడం కేటీఆర్ అలవాటు అని ఆరోపించారు. వారికి డ్రగ్స్ అలవాటు చేసింది కేటీఆరే అని, కేటీఆర్‌కు తల్లి అక్క, చెల్లి లేరా? అని ప్రశ్నించారు.
ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్డేట్స్.. ఎప్పటికప్పుడు ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది.
ఏపీలో 5 లక్షల ఉద్యోగాలు కల్పించటమే తమ ప్రభుత్వ లక్ష్యమని మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. టైర్ 2,3 సిటీస్‌లో కూడా ఐటీ స్పేస్ రావాల్సి ఉందని తెలిపారు. అందుకే ద్వితీయశ్రేణి నగరాల్లో కూడా కో వర్క్సింగ్ స్పేస్‌ను కల్పించేలా కార్యాచరణ చేపట్టామని అన్నారు.
పేదల బతుకుపై దెబ్బ కొట్టిన వ్యక్తి జగన్ అని బీజేపీ అధికార ప్రతినిధి యామినీ శర్మ ఆరోపించారు. జగన్ పాలనలో అన్ని వ్యవస్థల్లోనూ అవినీతి రాజ్యమేలిందని విమర్శించారు. మహిళలు, యువత, రైతులు, శ్రామికులు అన్ని రంగాల్లో అబివృద్ధి చెందాలనేది మోదీ లక్ష్యమని తెలిపారు.
గత ప్రభుత్వం భూముల రీ సర్వే పేరుతో ప్రజల ధనం దోచుకోడానికి పెద్ద కుట్ర పన్నిందని రెవిన్యూ మంత్రి అనగాని సత్య ప్రసాద్ ఆరోపించారు. ఈ రీ సర్వేను అడ్డుపెట్టుకోని జగన్ స్వంత వారికి లబ్ది చేకూర్చారని, ప్రచార యావతో ప్రజలను ఇబ్బందులు పెట్టారని మంత్రి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల లైవ్ అప్డేట్స్ను ఎప్పటికప్పుడు ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది.
గతంలో.. పోలీసు శాఖలో 16 వేల కానిస్టేబుల్ పోస్టుల భర్తీ ప్రక్రియకు అడ్డంకులు తొలగిపోయాయి. తప్పుగా అనువాదం చేసిన నేపథ్యంలో అభ్యర్థులందరికీ నాలుగు మార్కులు కలపాలని.. సమాధాన పత్రాలకు మళ్లీ మూల్యాంకనం చేయాలని పేర్కొంటూ సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును హైకోర్టు డివిజన్ బెంచ్ కొట్టివేసింది.
రాష్ట్రంలో అన్ని లిఫ్ట్‌లు ప్రస్తుతం శిథిలావస్థలో ఉన్నాయని మంత్రి నిమ్మల రామానాయుడు ఆందోళన వ్యక్తం చేశారు. తాళ్లూరు లిప్ట్కు సంబంధించి పీఎస్సీ పైపుల స్థానంలో ఎమ్మెస్ పైపుల ఏర్పాటుకు అంచనాలు రూపొందిస్తున్నామని మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు.