Share News

అప్రమత్తంగా ఉండాలి

ABN , Publish Date - Apr 26 , 2025 | 12:35 AM

గ్రామాల్లో ప్రజలు మలేరియా వ్యాధిపై అప్రమత్తంగా ఉండా లని మలేరియా సబ్‌ యూనిట్‌ అధికారి డాక్టర్‌ వెంక టేశ్వర్లు అన్నారు.

అప్రమత్తంగా ఉండాలి

బేతంచెర్ల, ఏప్రిల్‌ 25 (ఆంధ్రజ్యోతి): గ్రామాల్లో ప్రజలు మలేరియా వ్యాధిపై అప్రమత్తంగా ఉండా లని మలేరియా సబ్‌ యూనిట్‌ అధికారి డాక్టర్‌ వెంక టేశ్వర్లు అన్నారు. ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆర్‌ఎస్‌ రం గాపురం డాక్టర్‌ అబ్దుల్‌ఆలీం ఆధ్వర్యంలో అవగా హన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్‌ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ మలేరియా చలి వణుకు తో కూడిన జ్వరం రావడం కొన్ని సందర్భాల్లో ప్రా ణాంతకంగా మారుతుందన్నారు. కొన్ని సందర్భాల్లో ప్రాణాలు కోల్పోయ్యే పరిస్థితులు ఏర్పడుతాయన్నా రు. ప్రజలు తగ్గు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. కా ర్యక్రమంలో పీహెచఎస్‌ స్వర్ణమాంజరి, ఎంపీ హెచఈవో అబ్దుల్‌ గఫార్‌, సూపర్‌వైజర్‌ రాజ్యలక్ష్మి, ఆరోగ్య కార్యకర్తలు, ఆశా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Apr 26 , 2025 | 12:35 AM