Bhashyam Schools: పది ఫలితాల్లో భాష్యం విజయభేరి
ABN , Publish Date - Apr 24 , 2025 | 05:07 AM
ఏపీ పదో తరగతి ఫలితాల్లో భాష్యం విద్యాసంస్థలకు చెందిన వై.నేహాంజని 600కి 600 మార్కులు సాధించి రాష్ట్రంలో అగ్రస్థానాన్ని పొందింది. భాష్యం రామకృష్ణ పేర్కొన్న వివరాల ప్రకారం, 590కు పైగా 206 మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు.
600కి 600 మార్కులు సాధించిన వై.నేహాంజని
గుంటూరు(విద్య), ఏప్రిల్ 23(ఆంధ్రజ్యోతి): ఏపీ పదో తరగతి ఫలితాల్లో తమ విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ కనబరిచారని భాష్యం విద్యాసంస్థల చైర్మన్ భాష్యం రామకృష్ణ తెలిపారు. బుధవారం గుంటూరు భాష్యం మెయిన్ క్యాంప్‌సలో ఆయన మాట్లాడుతూ తమ విద్యార్థిని వై.నేహాంజని 600కి 600 మార్కులు సాధించి రాష్ట్రస్థాయిలో అగ్రస్థానంలో నిలిచినట్టు చెప్పారు. కె.ప్రేమసత్య లిఖిత, కె.హర్షిత్, ఎ.లిఖిత 599, పి.వి.ఎ్‌స.ఎ్‌స.శ్రీహాసిని, ఎస్.షాలిని సంహిత, ఎం.ప్రియజోషిని 598 మార్కులు సాధించారని వెల్లడించారు. 590కిపైగా మార్కులు 206 మంది, 580కిపైగా మార్కులు 953 మంది, 570కిపైగా 1,889 మంది, 550కిపైగా 3,585 మంది, 500 మార్కులకుపైగా 6,635 మంది విద్యార్థులు సాధించారన్నారు. గణితంలో 1,088 మంది, సైన్స్‌లో 724 మంది 100కు 100 మార్కులు సాధించినట్టు తెలిపారు. విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు చైర్మన్ రామకృష్ణ, వైస్ చైర్మన్ భాష్యం హనుమంతరావు, మేనేజింగ్ డైరెక్టర్ భాష్యం సాకేత్ రామ్ అభినందనలు తెలిపారు.
Also Read:
ఇలా నడిస్తే బోలెడు ప్రయోజనాలు..
లామినేషన్ మిషన్‌ను ఇలా వాడేశాడేంటీ...
ప్రధాని నివాసంలో కీలక సమావేశం..
For More Andhra Pradesh News and Telugu News..