Bhashyam JEE Toppers: సత్తాచాటిన భాష్యం విద్యార్థులు
ABN , Publish Date - Apr 20 , 2025 | 06:15 AM
జేఈఈ మెయిన్ ఫలితాల్లో భాష్యం విద్యార్థులు ప్రతిభను చాటారు. జి. సాయిమనోజ్ఞ 100 పర్సంటైల్ సాధించి ఫిమేల్ కేటగిరీలో టాపర్‌గా నిలిచింది
100 పర్సంటైల్ విద్యార్థిని సాయిమనోజ్ఞ
గుంటూరు(విద్య), ఏప్రిల్ 19 (ఆంధ్రజ్యోతి): జేఈఈ మెయిన్ ఫలితాల్లో తమ విద్యార్థులు జాతీయ స్థాయిలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచారని భాష్యం విద్యాసంస్థల ఛైర్మన్ భాష్యం రామకృష్ణ తెలిపారు. విద్యార్థిని జి.సాయిమనోజ్ఞ 100 పర్సంటైల్ సాధించి చరిత్ర సృష్టించిందన్నారు. ఫిమేల్ కేటగిరీలో ఆలిండియా టాపర్‌గా నిలవడంతోపాటు ఓపెన్ కేటగిరీలో ఆలిండియా 18వ ర్యాంకు సాధించిందన్నారు. వివిధ కేటగిరీల్లో కె.సాయి షణ్ముఖ రెడ్డి 2, డి.సుభాష్ 8, పి.లక్ష్మీనారాయణ 11, కె.యశ్వంత్ ఆలిండియా 13, కె.పార్థసారథి 20, డి. జశ్వంత్ బాలాజీ 22, సీహెచ్.దివ్యశ్రీ ఆలిండియా 31, ఎన్.ఆకాష్ 32, షేక్ అబ్దుల్ రహీమ్ 40, ఎస్.వెంకటసాయి చక్రి 48, కె.ఎ్‌స.సాయిరెడ్డి 52, జి.రాధాశ్యామ్ 52, టి.విక్రమ్ లెవి 57, సిహెచ్.మణికంఠ 64, కె. సాహిత్ 71 ర్యాంకులు సాధించారని తెలిపారు. 200లోపు 28 ర్యాంకులు, 500లోపు 60 ర్యాంకులు, 1000లోపు 82 ర్యాంకులు కైవసం చేసుకున్నామని తెలిపారు.