Home » AP News
అసెంబ్లీకి వెళ్లకుండా వైసీపీ రాజ్యాంగాన్ని అగౌరవపరుస్తోందని పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆరోపించారు.
ముంబయి సినీనటి కాదంబరి జత్వాని ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా నమోదైన కేసులో ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ పోలీసు అధికారులు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్లపై విచారణను హైకోర్టు డిసెంబరు 2కి వాయిదా వేసింది.
సోషల్ మీడియాలో పెట్టిన అసభ్యకరమైన పోస్టులకు సంబంధించి ఒంగోలు రూరల్ పోలీసు స్టేషన్లో విచారణకు హాజరుకావాల్సిన వర్మ.. ఇల్లు వదలి పరారయ్యారు. అరెస్టుకు భయపడి రెండు రోజులుగా వర్మ అజ్ఞాతంలోనే ఉన్నారు.
వాణిజ్య పన్నుల శాఖ ఉద్యోగుల సంఘం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం నేత కేఆర్ సూర్యనారాయణకు పోలీసులు క్లీన్చిట్ ఇచ్చారు. ఆయనపై నమోదైన అభియోగాలకు సంబంధించి ఎలాంటి ఆధారాలూ లేవని నిర్ధారించారు. ఈ విషయాన్ని విజయవాడలోని ఏసీబీ కోర్టుకు తెలియజేశారు.
ఏలూరు జిల్లా ద్వారకా తిరుమలలో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహాన్ని గుర్తుతెలియని దుండగులు ధ్వంసం చేశారు.
రాష్ట్రంలో పన్ను ఎగవేతదారులు, అక్రమ వస్తు రవాణా రూపంలో ప్రభుత్వ ఖజానాకు ఏర్పడుతున్న నష్టాన్ని అరికట్టేందుకు తగిన చర్యలు తీసుకోవాలని ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ అధికారులను ఆదేశించారు.
సమోసాల కోసమే గత వైసీపీ ప్రభుత్వం రూ.9 కోట్లు ఖర్చు పెట్టిందని, ఆసలు బాధ్యత అనేది లేకుండా వ్యవహరించిందని డిప్యూటీ సీఎం పవన్కల్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఉత్తరాంధ్ర సిగలో మరో కలికితురాయి. విశాఖ నగరానికి సమీపాన అనకాపల్లి జిల్లా నక్కపల్లి వద్ద ఆర్సెలర్ మిట్టల్, నిప్పన్ స్టీల్ ఇండియా కలిసి జాయింట్ వెంచర్ ప్రాజెక్టు కింద భారీ పెట్టుబడితో తలపెట్టిన ఇంటిగ్రేటెడ్ స్టీల్ప్లాంట్ నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం పచ్చజెండా ఊపింది.
75వ జాతీయ రాజ్యాంగ దినోత్సవం స్వతంత్ర భారత చరిత్రలో ఒక ముఖ్యమైన మైలురాయిని సూచిస్తుందని గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్ అన్నారు.
మాజీ సీఎం జగన్ సొంత జిల్లా కడప. ఐదేళ్లు ఆయన అధికారంలో ఉండడంతో ఈ జిల్లా అభివృద్ధిలో పరుగులు పెట్టి ఉంటుందనేది... ఇతర జిల్లా వాసులు భావన..! కానీ.. సొంత జిల్లా అభివృద్ధికి జగన్ చేసింది అంతంతమాత్రమే.