Botsa Satyanarayana: జగన్ భద్రతపై కేంద్రానికి లేఖ రాశాం
ABN , Publish Date - Apr 11 , 2025 | 06:47 AM
జగన్ భద్రత విషయంలో ప్రభుత్వం విఫలమైందని బొత్స ఆరోపించారు. ఈ విషయమై కేంద్రానికి లేఖ రాసినట్లు వెల్లడించారు
విశాఖపట్నం, ఏప్రిల్ 10(ఆంధ్రజ్యోతి): మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డికి భద్రత కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందని శాసన మండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ ఆరోపించారు. గురువారం విశాఖలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ రామగిరిలో హత్యకు గురైన వైసీపీ కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించేందుకు జగన్ వెళితే ప్రభుత్వం కనీస భద్రతా ఏర్పాట్లు చేయలేదన్నారు. జగన్ భద్రతపై తమకు ఆందోళనగా ఉందని, ఈ విషయమై కేంద్రానికి లేఖ రాశామని, స్వయంగా ప్రధానిని కలిసి వివరిస్తామన్నారు. రాజకీయ నేతలపై మాట్లాడడం పోలీసులకు ఫ్యాషన్ అయిపోయిందన్నారు.