Share News

ముగిసిన శతాబ్ది బ్రహ్మోత్సవాలు

ABN , Publish Date - Apr 19 , 2025 | 12:11 AM

పాతనగరంలో వనటౌన మెయిన బజార్‌లోని శ్రీరామాలయంలో వారం రోజులుగా కొనసాగుతున్న ఆలయ శతాబ్ది బ్రహ్మోత్సవాలు శుక్రవారం రాత్రి వైభవంగా ముగిశాయి.

 ముగిసిన శతాబ్ది బ్రహ్మోత్సవాలు
హంస వాహనంపై సీతారామచంద్ర లక్ష్మణ మూర్తులు

కర్నూలు కల్చరల్‌, ఏప్రిల్‌ 18 (ఆంధ్ర జ్యోతి): పాతనగరంలో వనటౌన మెయిన బజార్‌లోని శ్రీరామాలయంలో వారం రోజులుగా కొనసాగుతున్న ఆలయ శతాబ్ది బ్రహ్మోత్సవాలు శుక్రవారం రాత్రి వైభవంగా ముగిశాయి. వేడుకల్లో భాగంగా తెల్లవారుజామున సుప్రభాత సేవ, పంచామృతాభిషేకాలు, అనంతరం శ్రీరామచంద్ర మూల విరాట్టు అయిన ఏకాంత రామున్ని గంధంతో అలంకరణ చేశారు. 250 కమల పుష్పాలతో మహాలక్ష్మి హోమం సుధాపండితుడు, కడప ఉత్తరాది మఠం మఠాధికారి పండిత విద్యానిధి ఆచార్య చేతుల మీదుగా జరిపించారు. సాయంత్రం ఆలయ ప్రధాన అర్చకుడు మాళిగి హనుమేషాచార్యులు, ఈవో దినే్‌షచౌదరిల ఆధ్వర్యంలో సీతారామచంద్ర లక్ష్మణ ఉత్సవ మూర్తులను హంస వాహనంపై పురవీధుల్లో ఊరేగింపు నిర్వహించారు. అంతకు ముందు సంగీత విఽధ్వాంసురాలు నిల్మలతో రామదాసు కీర్తనలు వీణావాదనం గాన కచేరీ నిర్వహించారు. శతాబ్ది బ్రహ్మోత్సవ అభినందన సభలో పండిత మాళిగి విద్యానిధి ఆచార్య మాట్లాడుతూ వందేళ్ల క్రితం తమ ముత్తాత మాళిగి రామ్మూర్తి ఆచార్య ప్రారంభించిన ఈ బ్రహ్మోత్సవాలు మూడో తరం వారసులు నిర్వహించుకోవడం ఆనందదాయకమని చెప్పారు. ఈ సందర్భంగా ఆలయ స్వాగత సమితి సభ్యులను, ఇతర దాతలను శాలువాలతో, జ్ఞాపికలతో ఘనంగా సత్కరించారు. ఉత్సవ చివరగా ఉత్సవమూర్తులకు నాగవేలి, ఊంజలసేవ కార్యక్రమాలు చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఆర్‌ఎ్‌సఎస్‌ నాయుడు విఠల్‌రావు మాళిగి పావని, సత్యనారాయణమూర్తి, వ్యాసరాజ్‌, సత్యప్రియ తీర్థ, జయతీర్థ, వేదవ్యాస మూర్తి, సుధాకర్‌, మాళిగి భానుప్రకాశ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Apr 19 , 2025 | 12:11 AM