Share News

Gas Bill: గ్యాస్ బిల్లుపై ఈ నెంబర్ చూశారా.. మోసాన్ని ఈజీగా కనిపెట్టండి..

ABN , Publish Date - Mar 21 , 2025 | 08:57 PM

కేంద్ర ప్రభుత్వం ప్రతీ వినియోగదారుడికి ప్రతీ సంవత్సరం 12 గ్యాస్ సిలిండర్లను రాయితీ మీద అందిస్తోంది. రాయితీ గ్యాస్ సిలిండర్ల విషయంలో కొన్ని చోట్ల మోసాలు కూడా జరుగుతున్నాయి. డెలివరీ బాయ్స్ మోసాలకు పాల్పడుతున్నారు.

Gas Bill: గ్యాస్ బిల్లుపై ఈ నెంబర్ చూశారా.. మోసాన్ని ఈజీగా కనిపెట్టండి..
Gas Bill

కేంద్ర ప్రభుత్వం ప్రతీ వినియోగదారుడికి రాయితీపై ఏడాదికి 12 గ్యాస్ సిలిండర్లు అందిస్తున్న సంగతి తెలిసిందే. కుటుంబంలోని సభ్యుల సంఖ్యను బట్టి, అవసరాన్ని బట్టి సంవత్సరానికి 3,4 సిలిండర్లు మాత్రమే వాడే వారు కూడా ఉంటారు. ఇలా తక్కువ సిలిండర్లు వాడే వారిని కొంతమంది డెలివరీ బాయ్స్ టార్గెట్ చేస్తున్నారు. వాడకుండా మిగిలిపోయిన రాయితీ సిలిండర్లను బ్లాక్ మార్కెట్‌లో అమ్మి సొమ్ము చేసుకుంటున్నారన్న టాక్ బాగా వినిపిస్తోంది. గ్యాస్ సిలిండర్లు బ్లాక్‌లో అమ్ముకుంటున్న సంఘటన ఒకటి ఆంధ్రప్రదేశ్‌లో వెలుగు చూసింది. తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరానికి చెందిన ఓ గ్యాస్ వినియోగదారుడు సిలిండర్ బుక్ చేయలేదు.


అయినా కూడా అతడి మొబైల్‌కు బుకింగ్ కోడ్, ఓటీపీ, ఎంత డబ్బు చెల్లించాలో మెసేజ్‌లు వచ్చాయి. దీంతో వినియోగదారుడికి అనుమానం వచ్చింది. వెంటనే గ్యాస్ ఏజెన్సీ దగ్గరకు వెళ్లాడు. గ్యాస్ సిలిండర్ బుకింగ్ వివరాలు అడిగి తెలుసుకున్నాడు. తనకు తెలియకుండానే గ్యాస్ ఎలా బుక్ అయిందంటూ ప్రశ్నించాడు. అప్పుడు అసలు విషయం బయటపడింది. ఆ వినియోగదారుడికి గ్యాస్ సిలిండర్ డెలివరీ చేసే వ్యక్తి ఇదంతా చేసినట్లు తేలింది. వినియోగదారుడికి సంబంధించిన సిలిండర్ల వివరాలు తెలుసు కాబట్టి మోసానికి పాల్పడాలని చూశాడు. మీరు ఆ వినియోగదారుడిలా మోసపోకూడదని అనుకుంటే.. మీ బిల్లుపై ఉన్న వివరాలను అర్థం చేసుకోగలగాలి.


కొన్ని గ్యాస్ సంస్థలు వినియోగదారుడు రెండు గ్యాస్ సిలిండర్లు వాడుకుంటే బిల్లుపై.. 12 సిలిండర్లలో రెండు వాడుకున్నారు అని తెలిపేలా.. 2/12 అని ముద్రిస్తుంది. ఒక వేళ మీరు 10 వాడుకుంటే 10/12 అని ముద్రిస్తుంది. అంటే దానర్థం 10 సిలిండర్లు వాడుకున్నారు. 12లో ఇంకా రెండు మాత్రమే మిగిలి ఉన్నాయని . మరికొన్ని గ్యాస్ సంస్థలు గ్యాస్‌ను బరువు రూపంలో లెక్కిస్తాయి. సంవత్సరానికి 12 గ్యాస్ సిలిండర్లు.. ఒక్కో సిలిండర్ 14.2 కేజీలు ఉంటుంది. మొత్తం 12 గ్యాస్ సిలిండర్ల బరువు 170.4 కేజీలు అవుతుంది. మీరు 2 గ్యాస్ సిలిండర్లు తీసుకుని ఉంటే 28.4 కేజీ/170.4 కేజీ అని ముద్రిస్తుంది. అంటే 170 కేజీల్లో 28 కేజీలు వాడుకున్నారు అని. అందుకే వినియోగదారులు ఎప్పటికప్పుడు బిల్లును చెక్ చేసుకుంటూ ఉండాలి. అప్పుడే మోసపోకుండా ఉంటారు.


ఇవి కూడా చదవండి:

Minister Narayana: స్పీడందుకున్న విశాఖ మెట్రో పనులు.. మంత్రి నారాయణ

Posani Bail Granted: పోసాని కృష్ణ మురళికి బెయిల్.. ఇప్పుడైన బయటకు వస్తారా

CM Chandrababu : సీఎం చంద్రబాబు మరో సంచలన నిర్ణయం

Updated Date - Mar 21 , 2025 | 09:17 PM