Share News

Chandrababu Naidu: కేంద్రమంత్రి మేఘవాల్‌ ఇంట్లో ‘సైకిల్‌’పై చర్చ

ABN , Publish Date - Apr 23 , 2025 | 05:06 AM

చంద్రబాబు ఢిల్లీ పర్యటనలో ఎంపీ అప్పలనాయుడు సైకిల్ ప్రయాణం చర్చనీయాంశమైంది. కాలుష్య నియంత్రణపై అవగాహన పెంచేందుకు సైకిల్‌పై పార్లమెంటుకు వెళ్తున్నప్పలనాయుడును సీఎం ప్రశంసించారు.

Chandrababu Naidu: కేంద్రమంత్రి మేఘవాల్‌ ఇంట్లో ‘సైకిల్‌’పై చర్చ

టీడీపీ ఎంపీ అప్పలనాయుడుపై ప్రశంసల వర్షం

సీఎం చంద్రబాబు ఢిల్లీ పర్యటనలో సైకిల్‌పై ఆసక్తికర చర్చ జరిగింది. కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్‌ రామ్‌ మేఘవాల్‌ ఇంట్లో సైకిల్‌ బొమ్మను గమనించిన ఎంపీ అప్పలనాయుడు.. టీడీపీ చిహ్నాన్ని కేంద్రమంత్రి ఇంట్లో చూడడం సంతోషంగా ఉందని వ్యాఖ్యానించారు. వెంటనే కేంద్ర మంత్రి రామ్మోహన్‌ నాయుడు కలుగజేసుకుని.. మేఘవాల్‌ ఒకప్పుడు పార్లమెంటుకు సైకిల్‌పైనే వెళ్లేవారని చెప్పారు. ఈ సమయంలో చంద్రబాబు కలుగజేసుకొని.. ‘మన అప్పలనాయుడు కూడా ప్రమాణ స్వీకారం రోజు నుంచి ఈరోజు వరకు సైకిల్‌పైనే పార్లమెంటుకు వెళ్తున్నారు. కాలుష్య నియంత్రణ గురించి ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చేందుకు ఆయన చేస్తున్న ఈ ప్రయత్నం నిజంగా అభినందనీయం. అప్పలనాయుడు ఒక నిజమైన సమాజ సేవకుడు’ అని ప్రశంసించారు. అప్పలనాయుడు సైకిల్‌పై పార్లమెంటుకు వెళ్తుండగా తాను కూడా చూశానని, అది గొప్ప పని అని మేఘవాల్‌ సైతం కొనియాడారు.

Updated Date - Apr 23 , 2025 | 05:07 AM