శ్రీమఠం భూముల పరిరక్షణకు కృషి
ABN , Publish Date - Apr 24 , 2025 | 11:51 PM
రాఘవేంద్రస్వామి మఠం భూములను పరిరక్షించేందుకు కృషి చేస్తున్నామని మఠం ఏఏవో మాధవశెట్టి అన్నారు.
ఏఏవో మాధవశెట్టి
మంత్రాలయం, ఏప్రిల్ 24 (ఆంధ్రజ్యోతి): రాఘవేంద్రస్వామి మఠం భూములను పరిరక్షించేందుకు కృషి చేస్తున్నామని మఠం ఏఏవో మాధవశెట్టి అన్నారు. గురువారం తన కార్యాలయంలో దేవాదాయ శాఖ జిల్లా అసిస్టెంట్ కమిషనర్ సుధాకర్ రెడ్డి, మఠం మేనేజర్ వెంకటేష్ జోషి, శ్రీమఠం ఎస్టేట్ ఆఫీసర్ శ్రీనివాసరావు, సూపరింటెండెంట్ అనంతపురాణిక్, దేవాదాయ శాఖ ఇన్సపెక్టర్ వెంకటేశ్వర్లుతో ప్రత్యేకసమావేశాన్ని ఏర్పాటుచేశారు. ఈ సందర్భంగా ఏఏవో మాట్లాడుతూ రాఘవేంద్రస్వామి మఠం భూములు కొంత మంది ఇనామ్ భూములు విక్రయాలు చేశారని, వాటిపై రికార్డుల ఆధారంగా ముందుకు వెళ్తామని తెలిపారు. మఠానికి చెందిన సర్వే నెంబర్లలో తేడాలు లేకుండా కౌలు తీసుకున్న రైతుల నుంచి అగ్రిమెంటు చేసుకుని కౌలు ద్వారా మఠానికి అదనపు ఆదాయం చేకూరుస్తామన్నారు. అనంతరం భూముల విషయమై దేవాదాయశాఖ అధికారులు, శ్రీమఠం అధికారులతో కలిసి పీఠాధిపతితో చర్చించారు. కార్యక్రమంలో శ్రీమఠం సిబ్బంది నాగరాజు, కృష్ణారావు, దేవాదాయ శాఖ అధికారులు రఘురాం, రాము, సుజ్ఞానేంద్ర పాల్గొన్నారు.