Share News

Anantha Babu: డ్రైవర్‌ సుబ్రహ్మణ్యం హత్య కేసును పునర్విచారించాలి

ABN , Publish Date - Apr 22 , 2025 | 05:37 AM

వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు డ్రైవర్‌ హత్య కేసులో విచారణను పునఃప్రారంభించాలని మాజీ ఐపీఎస్‌ ఏబీ వెంకటేశ్వరరావు డిమాండ్‌ చేశారు. ఈ కేసులో జరిగిన లోపభూయిష్ట దర్యాప్తును ఆయన తీవ్రంగా విమర్శించారు.

Anantha Babu: డ్రైవర్‌ సుబ్రహ్మణ్యం హత్య కేసును పునర్విచారించాలి

ఇంత లోపభూయిష్టమైన దర్యాప్తును నా ఉద్యోగ జీవితంలో చూడలేదు

అనంతబాబును కాపాడేందుకు అన్ని వ్యవస్థలూ అడ్డదారులు తొక్కాయి

పోలీసులను మేనేజ్‌ చేసింది నాటి ఎమ్మెల్యే ద్వారంపూడి

కాకినాడలో జిల్లా కలెక్టర్‌, ఎస్పీలను కలిసిన ఏబీవీ

జి.మామిడాడలో బాధిత కుటుంబ సభ్యులకు పరామర్శ

కాకినాడ, ఏప్రిల్‌ 21(ఆంధ్రజ్యోతి): వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు డ్రైవర్‌ వీధి సుబ్రహ్మణ్యం హత్య కేసును పునర్విచారించాలని విశ్రాంత ఐపీఎస్‌ ఏబీ వెంకటేశ్వరరావు డిమాండ్‌ చేశారు. సోమవారం మధ్యాహ్నం కాకినాడ జిల్లా పెద్దాపురం మండలం జి.మామిడాడలోని సుబ్రహ్మణ్యం కుటుంబ సభ్యులను ఆయన పరామర్శించారు. వారిని వెంటపెట్టుకుని కాకినాడ జిల్లా కలెక్టర్‌ షాన్‌ మోహన్‌ను, జిల్లా ఎస్పీ బింధుమాధవ్‌ను కలిశారు. అనంతరం ఏబీవీ మీడియాతో మాట్లాడారు. ‘వైసీపీ హయాంలో రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారిన ఈ కేసులో జరిగినంత లోపభూయిష్టమైన దర్యాప్తును నా ఉద్యోగ జీవితంలో ఎప్పుడూ చూడలేదు. 2022 మే 20న జరిగిన ఈ హత్య కేసును అప్పటి జగన్‌ సర్కారు నీరుగార్చింది. అత్యంత నీచమైన, అమానవీయమైన ఈ కేసులో ముఖ్యమైన నిందితుడిగా ఉన్న అనంతబాబును కాపాడేందుకు నాడు ప్రభుత్వంలో ఉన్న అన్ని వ్యవస్థలూ ఎన్నో అడ్డదారులు తొక్కాయి.


వారు వేసిన కాగితాలు, రాసిన పంచనామాలు చూస్తే ట్రైనింగ్‌లో ఉన్న పోలీసు అధికారికైనా అది తెలిసిపోతుంది. డ్రైవర్‌ సుబ్రహ్మణ్యం హత్య కేసులో పోలీసు వ్యవస్థ మొత్తాన్ని మేనేజ్‌ చేసింది ప్రస్తుత మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి, అనుచరులు, నాయకులే. ఆయన, ఆయన కుటుంబ సభ్యులు, అనుచరులు, వ్యాపార భాగస్వాములు చేస్తున్న బియ్యం దోపిడీ కేసులో ఇంతవరకు పురోగతి కనిపించడం లేదు. ఆ కేసును కూడా త్వరితగతిన విచారించాలి. సాక్ష్యాలను సేకరించి, రాత్రికి రాత్రి కోటీశ్వరులుగా మారిన వారి నుంచి డబ్బంతా రాబట్టాలి. సుబ్రహ్మణ్యం కుటుంబానికి చట్ట ప్రకారం అందాల్సిన నష్టపరిహారం, సోషల్‌ వెల్ఫేర్‌ డిపార్ట్‌మెంట్‌ నుంచి అందాల్సిన పింఛన్‌ సొమ్ము త్వరితగతిన అందేలా చూడాలని, హతుడు తమ్ముడికి ఉద్యోగం కల్పించాలని జిల్లా కలెక్టర్‌ను కోరాం’ అని ఏబీవీ తెలిపారు.


ఈ వార్తలు కూడా చదవండి..

Post Office: ఏమిటి.. ఇన్నీ మంచి పథకాలా..

10th Class Result: 10వ తరగతి పరీక్ష ఫలితాలు.. విడుదల ఎప్పుడంటే..

Business: ఈ పథకంలో జస్ట్ రూ. 45 పెట్టుబడిగా పెట్టండి.. రూ. 25 లక్షలు మీ సొంతం

Rs 500 Notes: రూ. 500 నోట్లపై కీలక అప్ డేట్: కేంద్రం వార్నింగ్

Pope Francis: పోప్ ఫ్రాన్సిస్ మృతి.. స్పందించిన ప్రధాని మోదీ

వాటికన్ సిటీలో పోప్ ఫ్రాన్సిస్ (21-04-2025) సోమవారం మృతి చెందారు.

RVNL: దేశంలోనే తొలిసారి... అతిపొడవైన 14.57 కి.మీ.సొరంగం పూర్తి

For More Andhra Pradesh News and Telugu News..

Updated Date - Apr 22 , 2025 | 05:37 AM