క్షమా గుణమే యేసు నినాదం
ABN , Publish Date - Apr 19 , 2025 | 12:11 AM
క్షమా గుణమే క్రీస్తు నినాదమని యర్రగుంట్ల ఆర్‌సీ ఎం చర్చి ఫాదర్ ప్రకాష్ అన్నారు.
ఫ ఆర్‌సీఎం చర్చి ఫాదర్ ప్రకాష్
ఫ భక్తిశ్రద్ధలతో శుభశుక్రవారం ప్రార్థనలు
శిరివెళ్ల, ఏప్రిల్ 18(ఆంధ్రజ్యోతి) : క్షమా గుణమే క్రీస్తు నినాదమని యర్రగుంట్ల ఆర్‌సీ ఎం చర్చి ఫాదర్ ప్రకాష్ అన్నారు. మండలం లోని యర్రగుంట్ల, శిరివెళ్ల, గుండంపాడు, గో విందపల్లె తదితర గ్రామాల్లో క్రైస్తవులు చర్చి ల్లో ప్రత్యేక ప్రార్థనలతో గుడ్ ఫ్రైడే కార్యక్ర మాన్ని నిర్వహించారు. గ్రామాల్లో విశ్వాసులు సిలువను మోశారు. ఏసుక్రీస్తు మానవాళికి అందించిన సందేశాన్ని ప్రజలకు వినిపించారు.
ఉయ్యాలవాడ: పాపులను క్షమించటమే యేసుప్రభు నినాదమని ఉయ్యాలవాడ మం డల ఫాదర్ జోషిబాబు అన్నారు. గుడ్‌ఫ్రైడే సందర్భంగా మండలంలోని ఉయ్యాలవాడ, ఆర్.పాంపల్లె, సుద్దమల్ల, రూపనగుడి, హరివ రం, కొండుపల్లె, అల్లూరు, మయాలూరు తది తర గ్రామాల్లో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. యే సు ప్రభు సిలువలో పలికిన ఏడు మాటల గు రించి వివరించారు. మధ్యాహ్నం మూడు గం టల వరకు ప్రార్థనలు కొనసాగాయి.
ప్యాపిలి: పట్టణంలోని సియోన ప్రార్థనా మందిరంలో పాస్టర్ సుందరం ఆధ్వర్యంలో ప్రార్థనలు నిర్వహించారు. క్రైస్తవులు అధిక సంఖ్యలో పాల్గొని ప్రార్థనలు నిర్వహించారు.
బనగాన పల్లె: మండలంలోని పలుకూరు, నందవరం, కైప, అప్పలాపురం, టంగుటూరు, నందివర్గం, జిల్లెల్ల తదితర గ్రామాల్లో క్రైస్తవు లు భక్తిశ్రద్ధలతో గుడ్‌ఫ్రైడ్ వేడుకలను నిర్వ హించారు. అలాగే పట్టణంలోని సీఎ్‌సఐ చర్చి, మధర్ థెరిస్సా చర్చిల్లో ప్రత్యేక ప్రార్థన లు జరిగాయి.
కోవెలకుంట్ల: పట్టణంతో పాటు గుళ్లదుర్తి, భీమునిపాడు, దోరాశి, కలుగొట్ల, రేవనూరు, చిన్నకొప్పెర్ల, పెద్దకొప్పెర్ల, వల్లంపాడు, లింగాల, సౌదరదిన్నె, అమడాల, వెలగటూరు తదితర గ్రామాల్లో క్రైస్తవలు గుడ్‌ఫ్రైడే వేడుకలు భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. పెద్దలు సిలువను మోసుకుంటూ వీధుల గుండా ఊరేగింపుగా వెళ్లారు. అనంతరం చర్చిలో ప్రత్యేక ప్రార్థ నలు చేశారు. ఏసుక్రీస్తు శిలువలో ఆయన పలికిన మాటల గురించి సందేశం ఇచ్చారు.
రుద్రవరం: మండలంలో భక్తిశ్రద్ధలతో గుడ్‌ఫ్రైడే ప్రార్థనలు క్రైస్తవులు నిర్వహించారు. పెద్దకంబలూరు, కోటకొండ, చిన్నకంబలూరు, పేరూరు, మందలూరు, నరసాపురం, రుద్రవ రం, ఆలమూరు గ్రామాల్లో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. పెద్దకంబలూరులో పాస్టర్ జాన, సంఘకాపరి పెసల స్టాలిన సందేశాన్ని వి నిపించారు.
చాగలమర్రి: మండలంలోని ముత్యాల పాడు, పెద్దబోదనం, మద్దూరు, పెద్దవంగలి, గొడిగనూరు తదితర గ్రామాల్లో శుక్రవారం గుడ్‌ఫ్రైడేను ఘనంగా నిర్వహించారు. చాగలమర్రి గ్రామంలోని ఆర్సీఎం, సీఎ్‌సఐ, మార్తోమా చర్చిలలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిం చారు. ఆర్సీఎం చర్చి ఫాదర్ సిలువ యాత్రను ప్రారంభించాటారు. పురవీధుల గుండా సిలువ యాత్ర చేశారు. అ నంతరం చర్చిలో ప్రత్యేక ప్రా ర్థనలు చేశారు. క్రైస్తవులకు గుడ్‌ఫ్రైడే శుభాకాంక్షలు తెలియ జేశారు.
దొర్నిపాడు: ఆయా గ్రామాల్లోని చర్చిల్లో శుక్రవా రం గుడ్‌ఫ్రైడేను నిర్వహిం చారు. ప్రబోధకులు సంజీవ, తిమ్మయ్య, మనోజ్, ఇమ్మానుయేలు ప్రసంగిం చారు.
సంజామల: మండలంలోని ఆల్వకొండ, పే రుసోమల, గిద్దలూరు, ఆకుమళ్ల, నొస్సం, కాణా ల, సంజామల, సీఎ్‌సఐ చర్చిల్లో క్రైస్తవు లు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఆయా కార్యక్ర మంలో నొస్సం సీఎ్‌సఐ చర్చి పాస్టర్ విజయ్ కుమార్, ఆయా సంఘాల నిర్వాహకులు పాల్గొన్నారు.
డోన రూరల్: పట్టణంలోని వైఎస్ నగర్‌లో బైబిల్ మిషన చర్చిలో పాస్టర్ రెవ.బందెల రా జు క్రైస్తవులకు యేసుక్రీస్తు సందేశాన్ని వినిపిం చారు. మండలంలోని చిన్నమల్కాపురం, ఎర్రగుంట్ల, గుమ్మకొండ తదితర గ్రామాల్లోని చర్చిల్లో గుడ్ ఫ్రైడే వేడుకలు భక్తిశ్రద్ధలతో నిర్వహించుకున్నారు.
బేతంచెర్ల: మండలంలోని ఆయా గ్రామా లతో పాటు పట్టణంలో ఆయా చర్చిలలో క్రైస్త వలు గుడ్ ఫ్రైడే వేడుకలను శుక్రవారం ఘ నంగా జరుపుకున్నారు. ఆయా చర్చిలలో ప్ర త్యేక ప్రార్థనలు నిర్వహించి సిలువలను ఊరే గింపు నిర్వహించారు.
డోన టౌన: సర్వమానవాళిని రక్షించేందుకు లోకరక్షకుడైన యేసుప్రభు సిలువను మోశాడని డోన సీఎ్‌సఐ చర్చి పాస్టర్లు రెవ రెండ్ మేకల రాజేంద్రప్రసాద్, రెవరెండ్ సామే ల్ బాబు తెలిపారు. శుక్రవారం పట్టణం లోని సీఎ్‌సఐ చర్చిలో క్రైస్తవులు ప్రత్యేక ప్రా ర్థనలు చేశారు. కార్యక్రమంలో సంఘ పెద్దలు, క్రైస్తవ సోదరులు, ఫాస్టర్లు పాల్గొన్నా రు.
కొలిమిగుండ్ల: మండలంలోని వివిధ గ్రా మాల చర్చిలు, ప్రార్థనా మందిరాల్లో శుక్రవా రం గుడ్ ఫ్రైడేని భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. కొలిమిగుండ్ల సీఎస్ చర్చి నంది పాస్టర్ శ్రీదేవి ఆధ్వర్యంలో భక్తులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వ హించారు. మండలంలోని బెలుం, తుమ్మల పెంట, కనకాద్రిపల్లె, కల్వటాల, అంకిరెడ్డిపల్లె, బెలుం శింగవరం తదితర గ్రామాల్లో వివిధ చర్చిలు, ప్రార్థనా మందిరాలకు క్రైస్తవ సోదరు లు పెద్ద ఎత్తున తరలివచ్చి, ఏసును ఆరాధి స్తూ ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.