Share News

BC Study Circle: డీఎస్సీకి 24 నుంచి ఆన్‌లైన్‌లో ఉచిత శిక్షణ

ABN , Publish Date - Apr 22 , 2025 | 04:45 AM

బీసీ స్టడీ సర్కిల్‌ ఆధ్వర్యంలో ఈ నెల 24 నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఉచితంగా డీఎస్సీ శిక్షణ ఇవ్వనున్నట్లు బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత తెలిపారు. ఇప్పటి వరకు 5,200 మందికి శిక్షణ ఇచ్చినట్లు తెలిపారు.

BC Study Circle: డీఎస్సీకి 24 నుంచి ఆన్‌లైన్‌లో ఉచిత శిక్షణ

బీసీ స్టడీ సర్కిల్‌ ద్వారా ఏర్పాట్లు: మంత్రి సవిత

సోమందేపల్లి, ఏప్రిల్‌ 21(ఆంధ్రజ్యోతి): బీసీ స్టడీ సర్కిల్‌ ఆధ్వర్యంలో ఈ నెల 24 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఆన్‌లైన్‌ ద్వారా ఉచితంగా డీఎస్సీ శిక్షణ ఇస్తామని బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత తెలిపారు. శ్రీసత్యసాయి జిల్లా సోమందేపల్లిలో మంత్రి సోమవారం పలువురు డీఎస్సీ అభ్యర్థులతో మాట్లాడారు. ఇప్పటికే 5,200 మందికి ఉచిత శిక్షణ ఇచ్చామని తెలిపారు. 16,347 పసుఉస్టలకు డీఎస్పీ నోటిఫికేషన్‌ విడుదలైన వెంటనే అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నామన్నారు. విద్యా శాఖ మంత్రిగా నారా లోకేశ్‌ బాధ్యతలు చేపట్టిన అనంతరం విద్యాశాఖలో అనేక సంస్కరణలు తీసుకొస్తున్నారని తెలిపారు. జూన్‌ నాటికి అభ్యర్థులను ఎంపిక చేసి, జాయినింగ్‌ ఆర్డర్లు అందిస్తామని మంత్రి చెప్పారు.

Updated Date - Apr 22 , 2025 | 04:45 AM